నటి చౌరాసియా దాడి కేసు: ఎట్టకేలకు చిక్కిన నిందితుడు

Published : Nov 20, 2021, 09:07 AM IST
నటి చౌరాసియా దాడి కేసు: ఎట్టకేలకు చిక్కిన నిందితుడు

సారాంశం

నటి షాలు చౌరాసియాపై దాడి కేసు సంచలనం రేపింది. అత్యంత సెక్యూర్డ్ ఏరియాగా పేరున్న కేబీఆర్ పార్క్ సమీపంలో జరిగిన ఈ సంఘటన, అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, దాడికి పాల్పడిన నిందితుడ్ని అరెస్ట్ చేశారు.   

నవంబర్ 14 ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో నటి షాలు చౌరాసియా (Shalu chaurasiya) జాగింగ్ కోసం కేబీఆర్ పార్క్ కి రావడం జరిగింది. పార్క్ ఔటర్ ట్రాక్ పై జాగింగ్ చేస్తున్న చౌరాసియాపై ఓ దుండగుడు అమాంతంగా దాడికి దిగాడు. ఆమెను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు... మెడ, పెదవులపై గాయాలు చేశాడు. హఠాత్పరిణామంతో షాక్ కి గురైన ఆమె ప్రతిఘటించారు. ఈ క్రమంలో చౌరాసియాకు గాయాలు కావడం జరిగింది. 


దాడి అనంతరం చౌరాసియా ఆపిల్ మొబైల్ లాక్కొని అక్కడ నుండి పారిపోయాడు. ఇక ఈ కేసు సీరియస్ గా తీసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారాలతో పాటు, పాత నేరస్థులను విచారించడం జరిగింది. కృష్ణానగర్ కి చెందిన అరవై మంది నేరస్థులను ఆరా తీయడం జరిగింది.చిత్ర పరిశ్రమతో సంబంధాలున్న నేరస్థులపై కూడా నిఘా ఉంచారు. కాగా ఈ నేరానికి పాల్పడింది బాబు అనే వ్యక్తి అని తేల్చారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 


అలాగే దాడి చేయడం వెనుక అతని ఉద్దేశం ఏమిటో విచారిస్తున్నారు. హై ప్రొఫైల్ వ్యక్తులు జాగింగ్ కి వచ్చే కేబీఆర్ పార్క్ లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం, సిటీ భద్రతా ప్రమాణాలపై అనుమానాలు రేకెత్తించింది. అయితే చాక చక్యంగా నిందితుడ్ని పట్టుకొని, పోలీసులు కేసును చేధించారు. 

Also read నటి చౌరాసియా దాడి కేసులో కొత్త కోణం... సైకో పని, పెదవులూ మెడపై గాాయాలు
దాడికి గురైన చౌరాసియా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె షాక్ నుండి ఇంకా కోలుకోలేదని సమాచారం. ముఖం, మెడతో పాటు ఆమె కాలికి గాయాలు కావడం జరిగింది. సంఘటన అనంతరం నటి తల్లి, స్నేహితుడు అక్కడకు చేరుకోవడం జరిగింది. 

Also read Payal rajput: పాయల్ ప్రైవేట్ పార్ట్ పై ప్రియుడు చేయి... ప్రైవేట్ ఫోటో లీక్ చేసి షాక్ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar 30 Days Collections: జవాన్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన ధురంధర్‌.. బాలీవుడ్‌లో నెం 1.. కలెక్షన్లు ఎంతంటే?
Jana Nayakudu Trailer: `భగవంత్‌ కేసరి`ని మక్కీకి మక్కీ దించేసిన విజయ్‌.. కొత్తగా చూపించింది ఇదే.. వాళ్లకి వార్నింగ్‌