ChandrababuNaidu: `పవర్‌స్టార్‌/ఆర్జీవి` ట్రైలర్‌ చూసి కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు.. వర్మ సెటైర్లు

Published : Nov 19, 2021, 06:40 PM IST
ChandrababuNaidu: `పవర్‌స్టార్‌/ఆర్జీవి` ట్రైలర్‌ చూసి కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు.. వర్మ సెటైర్లు

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సెటైర్లు వేశారు. ఆయన ఏడుస్తున్న వీడియోని పంచుకుని షాకింగ్‌ పోస్ట్ పెట్టారు. ఇప్పుడది వైరల్‌ అవుతుంది.

టీడీపీ(తెలుగు దేశం పార్టీ) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కన్నీళ్లు పెట్టుకున్నాడు. రామ్‌గోపాల్‌ వర్మ(RGV) రూపొందించిన `పవర్‌స్టార్‌/ఆర్జీవి`(Rgv Missing) ట్రైలర్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏకంగా మీడియా ఎదుటే ఆయన కంటతడి పెట్టుకున్నారు. రెండు చేతులు అడ్డు పెట్టుకుని మరి, RGV Missing ట్రైలర్‌ చూసి ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదంటున్నాడు. ఒక నిమిషానికిపైగానే చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. మరి ఇంతకి ఏం జరిగింది.

టీడీపీ అధినేత Chandrababu Naidu శుక్రవారం ఏపీ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. అటు టీడీపీ, మరోవైపు వైసీపీ నేతల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. ఇందులో అధికార వైసీపీ నాయకులు తన ఫ్యామిలీని కించపరిచినట్టు మాట్లాడారని, తన వైఫ్‌ని ఈ వివాదంలోకి లాగారని వాపోయాడు చంద్రబాబు. దీంతో అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు, ఇకపై అసెంబ్లీలోకి అడుగు పెట్టనని, మళ్లీ సీఎం అయిన తర్వాతనే అసెంబ్లీలోకి వస్తానని చెప్పి శపథం చేశారు. దీంతో ఈ వార్త వైరల్‌ అయ్యింది. దీనికి తోడు అనంతరం ఆయన మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు చంద్రబాబునాయుడు వాపోయారు. 

అయితే ఈ క్లిప్‌ని కట్‌ చేసి ట్వీట్‌ చేశాడు వర్మ. `ఆర్జీవి మిస్సింగ్‌` ట్రైలర్‌ చూసి అని చంద్రబాబు అన్నట్టుగా మిమిక్రీ చేయించి ఏడుస్తున్న వీడియోని పంచుకున్నారు. ఈ సందర్భంగా వర్మ ట్వీట్‌ చేస్తూ, `చంద్రబాబు నాయుడు ఇప్పుడు `ఆర్జీవీమిస్సింగ్‌` ట్రైలర్ చూశారు. మీ రియాక్షన్‌కి థ్యాంక్స్ సర్‌` అని తెలిపారు వర్మ. తన సినిమా ట్రైలర్‌ చూసి చంద్రబాబు ఏడుస్తున్నాడనే విషయాన్ని ఇలా సెటైరికల్‌గా వాడుకున్నారు వర్మ. దీంతో ఇప్పుడీ వీడియో నెట్టింట, వర్మ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

రామ్‌గోపాల్‌ వర్మకి ఇలాంటి సెటైర్లు కామనే. కానీ ఈ సందర్భాన్ని వాడుకున్న తీరుకి అభినందనలు దక్కుతున్నాయి. ఇక `పవర్‌స్టార్‌ ఆర్జీవి మిస్సింగ్‌` సినిమాని భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ఛటర్జీ నిర్మిస్తున్నారు. అధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.ఇందులో పవన్ కల్యాణ్‌, చంద్రబాబు నాయుడు, చిరంజీవి వంటి వారి పాత్రలను సెటైరికల్‌గా చూపించారు వర్మ.

also read: పవన్,చంద్రబాబు లను టార్గెట్ చేస్తూ మళ్లీ సినిమా,ట్రైలర్ ఇదిగో

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే