
టాలీవుడ్ లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ నటిగా సన తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది. హీరోలకు, హీరోయిన్లకి తల్లిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సన ఎన్నో పాత్రలు పోషించింది. ఐదు పదుల వయసులోనూ సనా బేగమ్ అందమైన రూపంతో ఆకట్టుకుంటోంది. టివి సీరియల్స్ లో కూడా సనా రాణిస్తోంది.
అయితే సనా జీవితంలో ఒడిడుకులు, కష్టాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా సనా కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. తాజాగా ఇంటర్వ్యూలో సనా తన కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ లో కష్టాల గురించి మాట్లాడింది.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన సనా.. మొదట యాడ్ షూట్స్ చేసింది. నాకు సినిమాలో అవకాశాలు వచ్చే సమయానికి వివాహం జరిగింది. చిన్న వయసులో తల్లిందండ్రులు పెళ్లి చేశారు. అయితే మా అత్తామామ నాకు బాగా సపోర్ట్ చేశారు. సినిమాల్లో నటిస్తానంటే అడ్డుచెప్పకపోగా ప్రోత్సహించారు.
హీరోయిన్ గా కూడా అవకాశాలు వచ్చాయి. కానీ అక్కడ ఎదురైనా పరిస్థితులు నాకు నచ్చలేదు. హీరోయిన్ కావాలంటే స్విమ్ సూట్ లో కనిపించాలి, బాగా ఎక్స్ పోజ్ చేయాలి అని అన్నారు. అలాగే పెళ్లి, పిల్లల గురించి ఎక్కడా ప్రస్తావించొద్దు అని కూడా చెప్పారు.
దీనితో హీరోయిన్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేశాను. కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా అవమానాలు ఎదుర్కొన్నట్లు సనా తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ఆర్జీవీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ షూటింగ్ లో చేతికి ఫ్రాక్చర్ అయింది. దీనితో సినిమాలకు కొంత సమయం బ్రేక్ వచ్చింది అని సనా తెలిపింది.
ఇక తన కుమార్తె గురించి చెబుతూ సనా ఎమోషనల్ అయ్యారు. నా కుమార్తె విషయంలో ఎప్పుడూ బాధపడుతూ ఉంటాయి. నా కూతురికి పెళ్లి చేశాక ఆమె నరకం అనుభవించింది. ఆమెని కుటుంబ సభ్యులు దుబాయ్ కి తీసుకెళ్లారు. కనీసం ఆహారం కూడా ఇవ్వకుండా నరకం చూపించారు. కానీ ఏరోజూ నా కూతురు తన కష్టాలని బయట పెట్టుకోలేదు. ఒకసారి నాకు అనుమానం వచ్చి ఆరా తీస్తే అన్ని విషయాలు బయటపడ్డాయి.
తన డబ్బు, బంగారం మొత్తం వాడుకుని నా కూతుర్ని వేధించారు. నా చేతులతో ఎన్నో పెళ్లిళ్లు చేశా. అందరూ బావున్నారు. కానీ నా కూతురి జీవితమే ఇలా అయింది అంటూ సనా ఆవేదన వ్యక్తం చేశారు. మనవైపు తప్పు లేనప్పుడు ఎవరికీ తలదించాల్సిన అవసరం లేదు. న కూతురు విడాకులు తీసుకుంది. ప్రస్తుతం డిప్రెషన్ నుంచి బయటపడి యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది. ఐదేళ్ల కొడుకుని పోషించుకుంటోంది అని సనా తెలిపింది.