వామ్మో.. పూనకంతో ఊగిపోయిన నటి ప్రగతి.. మాస్ స్టెప్పులు చూశారా, వైరల్ వీడియో

pratap reddy   | Asianet News
Published : Oct 28, 2021, 04:08 PM IST
వామ్మో.. పూనకంతో ఊగిపోయిన నటి ప్రగతి.. మాస్ స్టెప్పులు చూశారా, వైరల్ వీడియో

సారాంశం

ప్రగతి టాలీవుడ్ లో సీనియర్ నటిగా కొనసాగుతున్నారు. 90 వ దశకం నుంచి ఆమె నటిగా రాణిస్తున్నారు. అప్పట్లో కొన్ని చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా కూడా నటించింది. 

ప్రగతి టాలీవుడ్ లో సీనియర్ నటిగా కొనసాగుతున్నారు. 90 వ దశకం నుంచి ఆమె నటిగా రాణిస్తున్నారు. అప్పట్లో కొన్ని చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా కూడా నటించింది. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తల్లి, అత్త తరహా పాత్రలకు దర్శకులు ప్రగతినే సంప్రదిస్తున్నారు. 

సెంటిమెంట్ పండిస్తూనే కామెడీ టచ్ తో ఆకట్టుకునే నైపుణ్యం Pragathi ఉంది. ఎఫ్2 చిత్రంలో ప్రగతి కామెడీ టైమింగ్ అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఎఫ్3 లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా ప్రగతి ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. 

ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన జిమ్ వర్కౌట్ వీడియోలు, సరదాగా ఇంట్లో డాన్స్ చేస్తున్న వీడియోలు, గ్లామర్ ఫొటోస్ ని ప్రగతి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ప్రగతి ఫిట్ నెస్ విషయంలో చాలా కేరింగ్ గా ఉంది. డాన్స్ చేసే సమయంలో ఆమె ఎనెర్జీ లెవల్స్ కుర్రాళ్లతో సమానంగా ఉంటున్నాయి. దీనితో ప్రగతి జోష్ చూస్తీ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

 

తాజాగా ప్రతి మరో క్రేజీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కుర్రాళ్ళని మించేలా తీన్మార్ డాన్స్ చేస్తూ పూనకంతో ఊగిపోయింది. మాస్ స్టెప్పులతో రెచ్చిపోయి డాన్స్ చేసింది. దీనితో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read: సీఎం జగన్ తో భేటీ కానున్న నాగార్జున.. చిరంజీవి లేకుండానే మీటింగ్

మీకున్న పిచ్చిని బయటకు తీసుకువచ్చే అవకాశాన్ని ఎప్పుడూ కోల్పోకండి అంటూ ఆ వీడియోకి కామెంట్ పెట్టింది. నెటిజన్లు ఈ వీడియోని లైకులు, కామెంట్స్ తో వైరల్ చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్