పూజాహెగ్దే ప్లానింగ్ మాములుగా లేదుగా.. విజయ్ దళపతితో అదిరిపోయే స్టెప్పులు.. ట్రెండింగ్ లో ‘బుట్టబొమ్మ’..

By Asianet News  |  First Published Jun 23, 2023, 5:21 PM IST

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde)  తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. దళపతి విజయ్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసింది. 
 


స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే కు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు. చివరిగా తను నటించిన నాలుగు చిత్రాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. దీంతో బుట్టబొమ్మ క్రేజ్ కాస్తా తగ్గినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. రీసెంట్ గా సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబోలోని ‘గుంటూరు కారం’ నుంచి కూడా బుట్టబొమ్మ తప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఇదొక్క ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఇది కూడా మిస్ అయ్యిందంటున్నారు. 

ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా పూజాహెగ్దే సందడి నెట్టింట తగ్గింది. ఈ క్రమంలో తాజాగా అదిరిపోయే ప్లాన్ వేసింది. ఈరోజు పూజా హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ చిత్రం ‘కిసి కా బాయ్ కిసి కి జాన్‘ చిత్రంలో ఓటీటీ రిలీజ్ అయ్యింది. మరోవైపు పూజా క్రేజ్ తగ్గిందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటని సరిచేసేలా పూజా హెగ్దే ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను పంచుకుంది. తమిళ స్టార్ విజయ్ దళపతి (Vijay Thalapathy)తో కలిసి Butta Bomma సాంగ్ కు స్టెప్పులేసిన వీడియోను అభిమానులతో పంచుకుంది.ఈ వీడియోలు చిన్నారులు కూడా ఉండటంతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

Latest Videos

విజయ్ దళపతి పేరు కూడా ‘లియో’ ఫస్ట్ లుక్, బర్త్ డే కారణంగా నెట్టింట మారుమోగుతోంది. ఇదే సమయంలో పూజా హేగ్దే పోస్ట్ చేసిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇలా తనపేరును సోషల్ మీడియాలో వినిపించింది పూజా హెగ్దే. మొత్తానికి ఆమె ప్లాన్ సక్సెస్ అయ్యిందని అంటున్నారు. 

ఇక పూజా హెగ్దే నుంచి గతేడాది వచ్చిన.. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ ఏడాది వచ్చిన ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’ కూడా ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయింది. ఇటు ‘గుంటూరు కారం’ నుంచీ తప్పుకుందంటున్నారు. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మున్ముందు ఎలాంటి ప్రాజెక్ట్స్ తో వస్తుందో చూడాలంటున్నారు. 

. anna grooving for song 😍

Eye feast for Mutuals pic.twitter.com/5xCEJNCBOB

— SSAA Kingdom™ (@SSAAKingdom)
click me!