నాగార్జున పరిస్థితి ఏంటి ఇలా అయ్యింది.. రెండు సినిమాలు క్యాన్సిల్‌? ఫ్యాన్స్ వర్రీ..

Published : Jun 23, 2023, 04:47 PM ISTUpdated : Jun 23, 2023, 05:56 PM IST
నాగార్జున పరిస్థితి ఏంటి ఇలా అయ్యింది.. రెండు సినిమాలు క్యాన్సిల్‌?  ఫ్యాన్స్ వర్రీ..

సారాంశం

`సోగ్గాడే చిన్ని నాయన` తర్వాత నాగ్‌కి సరైన హిట్‌ లేదు.  `ది ఘోస్ట్`, `ఆఫీసర్‌`, `మన్మథుడు 2`, `దేవదాస్‌`, `ఆఫీసర్‌`, `రాజుగారి గది 2`, `ఓం నమో వెంకటేశాయ` ఇలాంటి అన్ని సినిమాలు బోల్తా కొట్టాయి. 

నాగార్జున.. తన కెరీర్‌లో ఎన్నో హిట్లు, ఫ్లాప్‌లు చూశారు. ఎన్నో ప్రయోగాలు చేశారు. టాలీవుడ్‌ మన్మథుడుగా పాపులర్‌ అయిన నాగ్‌.. `శ్రీరామదాసు`, `అన్నమయ్య` లాంటి సినిమాలు చేసి మెప్పించారు. బంపర్‌ హిట్స్ అందుకుంటున్నారు. కానీ ఇటీవల ఆయనకు అనుకున్న విజయాలు రావడం లేదు. `సోగ్గాడే చిన్ని నాయన` తర్వాత నాగ్‌కి సరైన హిట్‌ లేదు. గతేడాది `బంగార్రాజు`లో మెరిశారు. అది యావరేజ్‌గానే నిలిచింది. పైగా అందులో నాగచైతన్య మెయిల్‌ లీడ్‌ చేశారు. 

నాగ్‌ నటించిన `ది ఘోస్ట్`, `ఆఫీసర్‌`, `మన్మథుడు 2`, `దేవదాస్‌`, `ఆఫీసర్‌`, `రాజుగారి గది 2`, `ఓం నమో వెంకటేశాయ` ఇలాంటి అన్ని సినిమాలు బోల్తా కొట్టాయి. గట్టిగా కమర్షియల్‌ హిట్‌ అనుకునే సినిమా దాదాపు ఏడేళ్లుగా ఒక్కటి కూడా రాలేదు. ఇటీవల రైటర్‌ ప్రసన్న కుమార్‌ బెజవాడని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఇందులో అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో సినిమా సాగుతుంది. దీనికి సంబంధించి నాగ్‌పై టెస్ట్ షూట్‌ కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఆగిపోయిందనే వార్త ఆశ్చర్యపరుస్తుంది. 

ఆ మధ్య డైరెక్టర్‌ని మారుతున్నారని కొత్త దర్శకుడిని తీసుకుంటున్నారని అన్నారు. కానీ ఈ ప్రాజెక్టే క్యాన్సిల్ అయ్యిందట.  ప్రసన్న కుమార్‌ చెప్పిన కథ ఫైనల్‌ స్క్రిప్ట్ విషయంలో నాగ్‌ సాటిస్పై కాలేదట. దీంతో పక్కన పెట్టినట్టు సమాచారం. వేరే దర్శకుడితో ఇదే స్క్రిప్ట్ చేయాలని, ప్రసన్న కుమార్‌ రైటర్ గా కొనసాగుతారని అనుకున్నారని, కానీ కథ విషయంలోనూ సమస్య ఉండటంతో క్యాన్సిల్‌ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని రైటర్‌ ప్రసన్న కుమార్‌.. `పొరింజు మరియమ్‌ జోష్‌` అనే మలయాళ సినిమా నుంచి కథ కాపీ కొట్టారట. అయితే తన స్టయిల్‌లో కథలో చాలా మార్పులు చేశారట. గోదావరి బ్యాక్‌ డ్రాప్‌లో కథని సిద్ధం చేశారట. ఫైనల్‌ స్క్రిప్ల్ నాగ్‌కి నచ్చకపోవడంతో సినిమాని ఆపేసినట్టు సమాచారం. 

సినిమా వద్దు అనుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఈ సినిమా రీమేక్‌ రైట్స్ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ వద్ద ఉన్నాయని, ఆయన వేరే హీరో, దర్శకుడితో ప్లాన్‌ చేస్తున్నారట. దీంతో సమస్యలు వస్తాయని, పైగా స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారట నాగార్జున. ఇదిలా ఉంటే నాగ్‌ మరో సినిమా కూడా కాన్సిల్‌ అంటున్నారు. ఓ సినిమాటోగ్రాఫర్‌ని దర్శకుడిగా పరిచేయం చేస్తూ సినిమా చేయాలనుకున్నారు నాగార్జున. ఆ స్క్రిప్ట్ విషయంలోనూ ఆయన సంతృప్తి చెందలేదని సమాచారం. ఇలా ఈ రెండు సినిమాలు ఆగిపోయాయని చెప్పాలి. కొత్త స్క్రిప్ట్ ల కోసం ఆయన వెయిట్‌ చేస్తున్నారని సమాచారం. 

ఇప్పటికే నాగార్జునని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. కుమారులు నాగచైతన్య, అఖిల్‌ పరిస్థితి కూడా బాగాలేదు. వారికి హిట్లు లేవు. ఈ ముగ్గురు హీరోల పరిస్థితి ఒకేలా ఉండటం, పైగా ఇప్పుడు నాగ్‌ రెండు సినిమాలు క్యాన్సిల్‌ కావడమనేది అక్కినేని అభిమానులను బాధిస్తున్న విషయం. కానీ లేట్‌ అయినా ఫర్వాలేదు, బలమైన కంటెంట్‌ ఉన్న సినిమాతో రావాలని గట్టిగా డిసైడ్‌ అయ్యారట నాగార్జున. మరోవైపు ఆయన `బిగ్‌ బాస్‌ 7` షో నుంచి హోస్ట్ గా తప్పుకుంటున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని, ఆయనే కొనసాగుతారని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది