షూటింగ్ లో ప్రమాదం, హీరోయిన్ కళ్యాణీ ప్రియదర్శన్ కు గాయాలు

Published : Jun 23, 2023, 04:57 PM IST
షూటింగ్ లో ప్రమాదం, హీరోయిన్ కళ్యాణీ ప్రియదర్శన్ కు గాయాలు

సారాంశం

ఈమధ్య షూటింగ్ సెట్స్ లో ప్రమాదాలు ఎక్కవగా జరుగుతున్నాయి. స్టార్స్ కు ఏదో రకంగా గాయాలు అవుతున్నాయి. ఈమధ్య షూటింగ్ సెట్ లో యంగ్ హీరో వరుణ్ తేజ్ గాయపడగా.. తాజాగా మరో స్టార్ కు షూటింగ్ లో గాయం అయ్యిది.  


తమిళ, మలయాళ పరిశ్రమలో వరుసగా అవకాశాలు సాధిస్తూ.. హిట్ల మీద హిట్లు కొడుతోంది కళ్యాణి ప్రియదర్శన్‌.  తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయం అయిన ఈ నటి.. టాలీవుడ్ లో  హలో , చిత్రలహరి, రణరంగం సినిమాల్లో వరుసగా సినిమాలు చేసింది. అయితే  తెలుగులో వరుస అవకాశాలు వచ్చినా.. కళ్యాణీకి హిట్లు మాత్రం లభించలేదు. దాంతో టాలీవుడ్ లో కెరీర్  ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. దీంతో తమిళ, మలయాళ భాషల్లో సినిమాలకు పరిమితం అయ్యింది కళ్యాణీ ప్రియదర్శన్.  

ప్రస్తుతం  మలయాళంలో ఆంటోని సినిమా చేస్తోంది కళ్యాణీ ప్రియదర్శన్.  ఈసినిమా  షూటింగ్ సూపర్  ఫాస్ట్ గానే జరుగుతుంది. అయితే షూటింగ్లో భాగంగా కళ్యాణి.. యాక్షన్‌ సీక్వెన్స్‌ లో పాల్గొనాల్సి ఉందట. అయితే షూటింగ్ లో సడెన్ గా ప్రమాదం జరిగి  కళ్యాణి గాయపడింది.  ఈ ప్రమాదంలో కళ్యాణి  ఎడమ చేతికి గాయం అయ్యిందట. ఈ విషయాన్ని స్వయంగా కళ్యాణి ప్రియదర్శన్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 

నెట్టింట్లో పోస్ట్ చేసిన కళ్యాణి ఈ విధంగా కామెంట్ రాసుకొచ్చింది. స్టంట్లు నాలాంటి బలహీనుల కోసం కాదు... అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆంటోనీ షూటింగ్‌లో భాగంగా 29వ రోజు గాయం అయ్యిందని కళ్యాణి చెప్పుకొచ్చింది. స్టార్ యాక్ట్రస్ పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈవీడియో  చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది కళ్యాణి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. 

ఇక టాలీవుడ్ లో కళ్యాణీ చేసిన చివరి సినిమా  ఛల్ మోహన్ రంగ సినిమా.  ఈసినిమా కూడా ప్లాప్ అవ్వడంతో కళ్యాణీ ప్రభావం తెలుగు పరిశ్రమలో లేకుండా పోయింది. ఇక చల్ మోహన రంగాలో కూడా హీరోయిన్ మేఘ ఆకాష్ కి తల్లిగా నటించింది కళ్యాణి ప్రియదర్శన్.  ఇక్కడ అవకాశాలు లేవు కాని  తమిళ, మలయాళంలో సినిమాలు చేసుకుంటూ..  మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తోంది కళ్యాణీ ప్రియదర్శి.  తెలుగులో స్టార్ హీరోలతో నటించినా హిట్లు లేవు కాని.. తమిళంలో మాత్రం వరుసగా మనాడు, హృదయం ,బ్రో డాడీ లాంటిసూపర్ హిట్ సినిమాలు కళ్యాణీ ప్రియదర్శన్ ఖాతాలో ఉన్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:ప్రూఫ్స్ మాయం చేసిన కాశీ-జైల్లోనే శ్రీధర్-కార్తీక్‌కి షాకిచ్చిన తాత
Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు