ప్రభాస్ 25వ సినిమా.. ఓ రేంజ్ లో అనౌన్స్మెంట్!

By team teluguFirst Published Oct 4, 2021, 12:55 PM IST
Highlights

వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ప్రభాస్(Prabhas), ప్రతిష్టాత్మక 25వ చిత్రానికి సిద్ధమయ్యారు. అక్టోబర్ 7న ప్రభాస్ 25వ సినిమాపై ప్రకటన రానుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నారు. వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ఆయన, ప్రతిష్టాత్మక 25వ చిత్రానికి సిద్ధమయ్యారు. అక్టోబర్ 7న ప్రభాస్ 25వ సినిమాపై ప్రకటన రానుంది. ఈ మేరకు టాలీవుడ్ వర్గాలు ధృవీకరించాయి. ఇక ఈ సినిమా డిటైల్స్ ఏమీ తెలియకున్నప్పటికీ సోషల్ మీడియాలో ఈ విషయం ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. 


మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రభాస్ గత చిత్రాలలో అసలు పోలిక లేని విధంగా సరికొత్తగా ఈ మూవీ ఉండనుందట. ప్రభాస్ ఇప్పటి వరకు ట్రై చేయని జోనర్, తన 25వ చిత్రం ద్వారా ట్రై చేయనున్నారట. దీనితో దర్శకుడు ఎవరు, బ్యానర్ ఏమిటనే ఆసక్తి అందరిలో మొదలైపోయింది. 


మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో మరోమారు ప్రభాస్ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ తో ప్రకటించిన విషయం తెలిసిందే. మరో ప్రభాస్ 25వ చిత్రం రాజమౌళితో అయితే అది సెట్స్ పైకి వెళ్ళడానికి సమయం తీసుకునే అవకాశం కలదు. ఇక ప్రభాస్ సైతం ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. 

click me!