Kayadu Lohar: బట్టల షాపు, స్టార్‌బక్స్‌లో పనిచేశా.. లాప్‌టాప్ వాడటం కూడా రాదు.. కయాదు లోహర్‌ కష్టాలు

Published : Mar 25, 2026, 12:42 PM IST
Kayadu Lohar

సారాంశం

`ఫంకీ` చిత్రంతో ఇటీవల తెలుగు ఆడియెన్స్ ని అలరించిన కయాదు లోహర్ తన కెరీర్ బిగినింగ్‌ డేస్‌ గురించి పంచుకుంది. సినిమాల్లోకి రాకముందు బట్టల షాప్‌లో పనిచేసిందట. తాను చేసిన చిన్న చిన్న పనుల గురించి ఓపెన్‌గా చెప్పింది కయాదు లోహర్‌. 

ఫంకీ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన కయాదు లోహర్‌

కయాదు లోహర్ ఇటీవలే తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది.  విశ్వక్‌ సేన్‌ హీరోగా వచ్చిన `ఫంకీ` చిత్రంతో అలరించింది. ఈ మూవీ ఆడలేదు, కానీ కయాదు మాత్రం బాగా పాపులర్‌ అయ్యింది. వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె టోవినో థామస్ హీరోగా వస్తున్న 'పల్లించట్టంబి' సినిమాతో మళ్లీ అలరించేందుకు వస్తోంది. ఇది ఏప్రిల్‌లో రిలీజ్‌ కాబోతుంది.

సినిమాల్లోకి రాకముదు కయాదు ఏం చేసిందో తెలుసా?

ఈ సందర్భంగా, సినిమాల్లోకి రాకముందు తాను చేసిన పనుల గురించి కయాదు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాను ఒకప్పుడు బట్టల షాపులో, స్టార్‌బక్స్‌లో కూడా పనిచేశానని, తనకు సరిగ్గా ల్యాప్‌టాప్ వాడటం కూడా రాదని కయాదు లోహర్ చెప్పింది. ఆమె మాట్లాడుతూ, `సినిమాల్లోకి రాకముందు నేను చాలా పనులు చేశాను. స్టార్‌బక్స్‌లో, ఓ బట్టల దుకాణంలో పనిచేశా. కొన్ని ఐటీ కంపెనీల్లో కూడా చేరాను. కానీ అసలు ఫన్ ఏంటంటే, నాకు ల్యాప్‌టాప్ సరిగా వాడటం రాదు. అందుకే ఐటీ కంపెనీల్లో ట్రైనింగ్ పీరియడ్ వరకే ఉండి మానేశాను` అని కయాదు నవ్వుతూ చెప్పింది. 

ఇక, టోవినో థామస్ హీరోగా డిజో జోస్ ఆంటోనీ డైరెక్ట్ చేస్తున్న 'పల్లించట్టంబి' సినిమా టీజర్‌ను  రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు టీజర్‌లోని విజువల్స్ చూశాక సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వరల్డ్ వైడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నౌఫల్, బ్రిజీష్‌లతో పాటు సి క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చాణుక్య చైతన్య చరణ్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'పల్లించట్టంబి' సినిమాను ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

'పల్లించట్టంబి' స్టోరీ నేపథ్యం

ఈ సినిమా కథ 1950-60ల కాలంలో జరుగుతుంది. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. బాలీవుడ్ సూపర్ హిట్ సింగర్ విశాల్ మిశ్రా మొదటిసారి మలయాళంలో పాడిన 'కాట్టుచెంపకం' పాట ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. డైరెక్టర్ డిజో జోస్ ఆంటోనీ, మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ కాంబోలో వస్తున్న నాలుగో సినిమా ఇది. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'క్వీన్', 'జన గణ మన', 'మలయాళీ ఫ్రమ్ ఇండియా' సినిమాల్లో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఈ కాంబోపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో విజయరాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కెడమంగళం, ప్రశాంత్ అలెక్స్ వంటి ప్రముఖ నటులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ ముందుకు కూడా రాబోతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas: దేవుడా మళ్లీ పోయిందా, ప్రభాస్‌ ఎమోషనల్‌.. కట్‌ చేస్తే చిరు, బాలయ్యకి చుక్కలు చూపించిన సినిమా
Tollywood: మోహ‌న్ బాబును కాపీ కొట్టిన మ‌హేష్ బాబు.. 35 ఏళ్ల క్రిత‌మే పోకిరీ సీన్‌. వైర‌ల్ వీడియో