Lechindi Mahila Lokam : నవ్విస్తూనే అదిరిపోయే మెసేజ్, లేచింది మహిళా లోకం మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

Published : Mar 24, 2026, 12:06 PM ISTUpdated : Mar 24, 2026, 01:06 PM IST
Lechindi Mahila Lokam movie

సారాంశం

సమాజంపై సంధించిన ఒక సాహసోపేతమైన, చమత్కార వ్యంగ్యాస్త్రం లేచింది మహిళా లోకం సినిమా. సనాతన పద్దతులను ప్రశ్నిస్తూ.. సెటైరికల్ గా తెరకెక్కించిన ఈ సినిమా.. రిలీజ్ కు రెడీ అవుతోంది.

సనాతన పద్ధతులను ప్రశ్నిస్తూ..

సమాజంలోని సనాతన పద్ధతులను తలకిందులు చేస్తూ, సరికొత్త కథనంతో అలరించడానికి రెడీగా ఉంది లేచించి మహిళా లోకం సినిమా. మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మార్చి 26, 2026న థియేటర్లలో విడుదల కానుంది. అర్జున్ కార్తీక్ దర్శకత్వంలో వస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. హాస్యాన్ని, పదునైన సామాజిక పరిశీలనను మేళవించి, సాంప్రదాయక అధికార సమీకరణాలు మారిన సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఎంటర్ట్టైమ్మెంట్ తో పాటు మంచి మెసేజ్ ను అందించే ఈసినిమా డైలాగ్స్ తో దుమ్మురేపడానికి సిద్దం అవుతోంది. సంభాషణలే ఊపిరిగా సాగే ఈ కామెడీ చిత్రం.. చక్కటి రచన, హాస్యం, ఆసక్తికరమైన సంభాషణలతో ప్రేక్షకులను నవ్విస్తూనే...నిశ్శబ్దంగా ఆలోచింపజేస్తుంది.

 

 

సమాజంలో జరిగే విషయాలను చూపిస్తూ..

ఈ సినిమా ప్రధానంగా సమాజపు కట్టుబాట్లను, లింగ వివక్షను ప్రశ్నిస్తుంది. ఎక్కడా ఘర్షణ పడకుండా, కామెడీ ద్వారానే పాత సంప్రదాయాలను నిలదీస్తుంది. ప్రతీ రోజు సమాజంలో జరిగే విషయాలను తీసుకుని.. అద్భుతమైన స్క్రీన్ ప్లేను రాసుకున్నారు. కొన్ని ఊహాత్మక సన్నివేశాలను అద్భుతంగా వాడుకున్నారు. సినిమాకు డైలాగ్స్ అతిపెద్ద బలం. అవి ఒకవైపు కామెడీ టైమింగ్‌ను నడిపిస్తూనే, మరోవైపు సినిమా ఇవ్వాలనుకున్న సందేశాన్ని అంతే బలంగా మోసుకెళ్తాయి.

కామెడీతో పాటు మంచి మెసేజ్..

ఈ చిత్రానికి ప్రతిభావంతులైన ద్వయం అర్జున్-కార్తీక్ రచన, దర్శకత్వం వహించారు. వినోదానికి సామాజిక సందేశాన్ని మేళవించి వారు తమ మార్క్ తో అద్భుతం చేశారు. ఇద్దరి ఆలోచనల వల్ల సినిమా టోన్ ఎక్కడా పక్కదారి పట్టలేదు. హాస్యం వల్ల తాము ఇవ్వాలనుకున్న మెసేజ్ కు ఎక్కడా దెబ్బ తగలకుండా జాగ్రత్త పడ్డారు. బృహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్పారెంట్లీ డిజిటల్ తో కలిసి స్టోరీ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సందేశంతో కూడిన వినోదాత్మక సినిమాలను ప్రేక్షకులకు అందించాలన్నది వారి లక్ష్యం. సామాజిక అవగాహన, కామెడీ కలగలిసిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తూనే నమ్మకాన్ని మూవీ టీమ్ వెల్లడించారు. చూడాలి ఈసినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Love and War: లవ్ అండ్ వార్ సెట్‌లో విషాదం.. భన్సాలీపై చట్టపరమైన చర్యలకు డిమాండ్
Samantha Pregnancy: సారీ, సినిమాల నుంచి మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నా.. అఫీషియల్ గా గుడ్ న్యూస్ చెప్పిన సమంత