Meera Vasudevan: కొన్ని తప్పులు చేశా, మూడు సార్లు విడాకులపై గోల్‌ మాల్‌ నటి బోల్డ్ కామెంట్స్

Published : Mar 23, 2026, 01:42 PM IST
Meera Vasudevan

సారాంశం

`గోల్‌ మాల్‌` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయిన  నటి మీరా వాసుదేవ్ తన విడాకుల గురించి ఓపెన్‌ అయ్యారు.  ఎందుకు డైవర్స్ తీసుకోవాల్సి వచ్చిందో వెల్లడించారు. ఈ క్రమంలో షాకింగ్‌ విషయాలను పంచుకున్నారు. 

విడాకులపై స్పందించిన గోల్‌మాల్‌ హీరోయిన్‌

`గోల్‌మాల్‌` మూవీలో జేడీ చక్రవర్తితో కలిసి తెలుగు ఆడియెన్స్ ని ఊపేసింది నటి మీరా వాసుదేవన్‌. ఆ తర్వాత `అంజలి  ఐ లవ్యూ` అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.  మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసి మెప్పించింది. ఆ తర్వాత హిందీలోనూ మెరిసింది. అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఆమె వార్తల్లో నిలిచింది. విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను విడాకులు తీసుకున్నానని, ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నానని చెప్పడం వెనుక కారణాన్ని మీరా వాసుదేవ్ వివరించారు. తన గురించి తప్పుడు ప్రచారాలు జరగకుండా ఉండేందుకే ఈ విషయాన్ని బయటపెట్టినట్లు ఆమె తెలిపారు.

 ఇప్పుడు సింగిల్‌ గానే ఉన్నా - మీరా వాసుదేవన్‌

`నా గురించి తప్పుడు వార్తలు వ్యాపించకుండా, అపార్థాలు రాకుండా ఉండేందుకే నేను విడాకులు తీసుకున్నానని, సింగిల్‌గా ఉన్నానని చెప్పాను. నాపై వచ్చే నెగటివిటీ, వీడియోలు నన్ను పెద్దగా బాధించవు. ఇవన్నీ జరుగుతాయని నేను ముందే ఊహించాను. నా వైపు నుంచి తప్పులు జరిగాయి. నేను దాచడానికి ఏమీ లేదు. జీవితంలో ముందుకు వెళ్లాలి` అని మీరా స్పష్టం చేశారు.

కెరీర్‌ గురించి మీరా ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

`ప్రస్తుతం నా కెరీర్‌లో చాలా బిజీగా ఉన్నాను. జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నా జీవితంలో ఒక అందమైన దశ. అనుభవాల నుంచే జీవితంలో స్పష్టత వస్తుంది. మనకు మనమే సౌకర్యంగా లేనప్పుడు, ఇతరుల నుంచి గుర్తింపు కోరుకుంటాం. అప్పుడు వాళ్లు చెప్పిందే మన నిజం అవుతుంది. అలా అని ఇతరులను బాధపెట్టకూడదు. కానీ, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ఎదగాలి` అని మీరా వాసుదేవ్ చెప్పుకొచ్చారు. 'మూవీ వరల్డ్ మీడియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరా ఈ విషయాలు పంచుకున్నారు.

మూడు పెళ్లిళ్లు చేసుకున్న మీరా వాసుదేవన్‌

మీరా వాసుదేవన్‌ 2005లో సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ కుమార్‌ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2010లో విడిపోయింది. రెండేళ్ల తర్వాత 2012లో ఆమె నటుడు జాన్‌ కొక్కెన్‌ని మ్యారేజ్‌ చేసుకుంది. నాలుగేళ్లకే ఆయన్నుంచి కూడా విడిపోయింది. మళ్లీ విపిన్‌ పుతియాంకన్‌ని 2024లో పెళ్లి చేసుకుంది. గతేడాది విడిపోయింది. చూడబోతుంటే మరో వనితా విజయ్‌ కుమార్‌లా ఉంది మీరా వాసుదేవన్.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Jr Ntr: లక్ష్మీ ప్రణతి తన జీవితంలోకి రావడంలో ఎన్టీఆర్‌లో వచ్చిన మార్పు ఇదే.. ఆ విషయంలో భయం
Revenge: 18 ఏళ్ల క్రితం భార్య దీపికా కి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకున్న రణవీర్ సింగ్