#SSMB28: త్రివిక్రమ్ అనగానే రమ్యకృష్ణను 'అత్త'గా ఫిక్స్ ?

Published : Feb 26, 2023, 03:31 PM IST
 #SSMB28: త్రివిక్రమ్ అనగానే రమ్యకృష్ణను 'అత్త'గా ఫిక్స్ ?

సారాంశం

మహేష్ బాబు కాంబినేషన్‌లో రమ్యకృష్ణ కూడా పెద్దగా సినిమాలు చేయలేదు. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే SSMB28 మూవీపై ప్రేక్షకుల్లో ఇంట్రస్ట్ మరింత పెరుగుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.  

త్రివిక్రమ్ సినిమాల్లో సీనియర్ ఆర్టిస్ట్ లు కీలక పాత్రలు పోషిస్తారనే సంగతి తెలిసిందే. సీనియర్ నటీమణులు కోసం తన సినిమాల్లో అత్యంత ఆసక్తికరమైన పాత్రలను సృష్టిస్తాడు. త్రివిక్రమ్ 'అత్తారింటికి దారేది'లో కనిపించిన నదియా కెరీర్‌ను రీలాంచ్ చేసినట్లుగా మొదలెట్టింది. అప్పటి నుంచి సీనియర్స్ ఆయన సినిమాల్లో వేషాలు వేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు.  ఆక్రమంలోనే ఇప్పుడు త్రివిక్రమ్ కొత్త చిత్రం  (#SSMB28)లో ఓ ముఖ్యమైన పాత్రలో రమ్య కృష్ణను తీసుకున్నాడు.

వాస్తవానికి త్రివిక్రమ్ చాలా కాలం క్రితమే ఆమెకు కథ చెప్పాడు, అయితే ఆమె ఇటీవలే ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పింది.  వాస్తవానికి ఈ క్యారెక్టర్ కోసం అలనాటి హీరోయిన్ శోభనతో డైరెక్టర్ త్రివిక్రమ్ తొలుత చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ.. గత ఏడాది ఆధ్యాత్మిక పర్యటనల్లో ఉన్న శోభన.. ఈ సినిమాలో చేయడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపలేదట. దాంతో ఆమె ఈ మూవీలో నటించడంపై చిత్ర యూనిట్‌కి ఓ క్లారిటీకి రాలేకపోయింది.  

బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ క్రేజ్ పెరిగిపోయింది. కానీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమె నటించలేదు. అలానే మహేష్ బాబు కాంబినేషన్‌లో రమ్యకృష్ణ కూడా పెద్దగా సినిమాలు చేయలేదు. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే SSMB28 మూవీపై ప్రేక్షకుల్లో ఇంట్రస్ట్ మరింత పెరుగుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.  

ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ సోమవారం (ఫిబ్రవరి 27) నుంచి హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ప్రారంభం కానుంది.  త్రివిక్రమ్ (Ramya Krishnan) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu ) సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. అలానే జగపతి బాబు నెగటివ్ రోల్ పోషిస్తున్నాడు. గత ఏడాది నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ఆగస్టులో థియేటర్లలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ప్రధాన తారాగణంలో మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల, రమ్యకృష్ణ ఉన్నారు. థమన్ సంగీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను హారిక హాసిని క్రియేషన్స్ బ్యాంక్రోల్ చేస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్