అది చూసి అందరూ నా విగ్రహాలు పెట్టుకోవాలి.. నటి హేమ!

Published : Apr 02, 2019, 10:37 AM IST
అది చూసి అందరూ నా విగ్రహాలు పెట్టుకోవాలి.. నటి హేమ!

సారాంశం

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వైసీపీలోకి వెళ్లే వారి సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా సినీ తారలు వైసీపీ బాటపడుతున్నారు. 

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వైసీపీలోకి వెళ్లే వారి సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా సినీ తారలు వైసీపీ బాటపడుతున్నారు. ఇప్పటికే మోహన్ బాబు, పృధ్వీ, రాజశేఖర్, జీవిత, యాంకర్ శ్యామల వంటి వారితో పాటు నటి హేమ కూడా వైసీపీ పార్టీలో చేరింది.

ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాను కొన్ని ఆశిస్తున్నట్లు, కానీ పవన్ కళ్యాణ్ గారు, వైసీపీ వాళ్లు ఏమీ ఆశించకుండా రండి అని అంటున్నారని, తనకు ప్రజాసేవ చేయాలనుందని చెప్పింది. 

దాని కోసం పవన్ కావాలని, అందరూ స్టేజ్ పైన ఉంటే తాను కింద ఉండలేనని చెప్పింది. తనకు కూడా స్టేజ్ పై ఉండాలనుందని, జనాలకు దగ్గరగా వారి గుండెల్లో ఉండాలనుందని తెలిపింది. అయితే ఇప్పటికే అన్నీ అయిపోయాయని, ఇప్పుడు తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించేంత అమాయకురాలిని కాదని అంది.

ప్రజాసేవ చేయడానికి తనకు పవర్ కావాలని, అది ఎమ్మెల్యేనో లేక ఎంపీనో కాదని, ఏ పదవైనా పరవాలేదని చెప్పింది. భవిష్యత్తులో తాను పోటీ చేయడానికి రెండు  నియోజకవర్గాలు ఎన్నుకున్నట్లు ఈ సందర్భంగా చెప్పింది. పూర్తిగా ప్రజాసేవ చేస్తానని, అది చూసి అందరూ తన విగ్రహాలు పెట్టుకోవాలని చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Soundarya: చనిపోవడానికి ముందు మేనకోడలితో సౌందర్య ఏమన్నారంటే? చివరి మాటలు ఇవే
Don't Trouble The Trouble 5 Days Collections: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కి దారుణమైన కలెక్షన్లు.. 5 రోజుల్లో ఇంతేనా