ప్రముఖ దర్శకుడు కన్నుమూత!

Published : Apr 02, 2019, 09:56 AM IST
ప్రముఖ దర్శకుడు కన్నుమూత!

సారాంశం

ప్రముఖ తమిళ దర్శకుడు జె.మహేంద్రన్ (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. 

ప్రముఖ తమిళ దర్శకుడు జె.మహేంద్రన్ (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.

ఈ విషయాన్ని ఆయన కుమారుడు జాన్ వెల్లడించాడు. దర్శకుడు మహేంద్రన్ తమిళంలో ఎన్నో భారీ చిత్రాలను  తెరకెక్కించారు. ముల్లుమ్ మలరుమ్, జానీ వంటి చిత్రాలు దర్శకుడిగా ఆయనకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. దాదాపు ఎనభై సినిమాలను డైరెక్ట్ చేసిన మహేంద్రన్ రెండు సార్లు జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయన మరణవార్త విని తమిళ చిత్రపరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది.

ఆయన ఆత్మకి శాంతి కలగాలని పలువురు ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది