ఇది సినిమానా.. ఓ గాడ్‌.. అసలు భరించలేకపోయా!

By Udaya DFirst Published Apr 2, 2019, 10:02 AM IST
Highlights

ఓ సినిమా హిట్ టాక్ తో నడుస్తున్నప్పుడు దాన్ని గురించి ఎవరైనా కామెంట్స్ చేస్తే బాధ కలుగుతుంది. 

ఓ సినిమా హిట్ టాక్ తో నడుస్తున్నప్పుడు దాన్ని గురించి ఎవరైనా కామెంట్స్ చేస్తే బాధ కలుగుతుంది. అదే ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్ నెగిటివ్ గా మాట్లాడితే..అది వైరల్ అయితే ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు అదే సమంత తాజా చిత్రం విషయంలో జరుగుతోంది. సమంత నటించిన ‘సూపర్‌ డీలక్స్’ చిత్రంపై ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్‌ నటరాజన్‌ సుబ్రహ్మణ్యం కామెంట్‌ చేశారు. అవి వైరల్ అయ్యాయి. 

త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహించిన  ‘సూపర్‌ డీలక్స్’  చిత్రంలో విజయ్‌ సేతుపతి హిజ్రా పాత్రలో, రమ్యకృష్ణ వేశ్య పాత్రల్లో నటించారు. సమంత చాలా విభిన్నమైన పాత్రలో కనిపించారు. గత వారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. 

అయితే ఈ సినిమా  అందరికీ నచ్చలేదు. కొందరు చూసి సైలెంట్ అయ్యితే..మరి కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ వ్యాఖ్యానాలు చేసారు. ఈ సినిమా గురించి నటరాజన్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘నిజ జీవితంలో ఇలాంటి అసహ్యమైన అంశాలను ప్రోత్సహించడం, అభినందించడం కరెక్టేనా? ఇలాంటి తక్కువ స్థాయి అంశాలకు నేను దూరంగా ఉంటాను. ‘సూపర్‌ డీలక్స్’.. ఇది సినిమానా.. ఓ గాడ్‌.. అసలు భరించలేకపోయా’ అన్నారు.

నటరాజన్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ట్వీట్‌ కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ సినిమా అభిమానులు మాత్రం నటరాజన్‌ వ్యాఖ్యల పట్ల ఆయన్ను తప్పుబడుతున్నారు. సినిమా నచ్చకపోయినంత మాత్రాన ఇలా నీచంగా కామెంట్‌ చేయకూడదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై సమంత స్పందించలేదు కానీ బాధపడినట్లు సమాచారం. గతంలో సమంత నటించిన అ...ఆ చిత్రానికి నటరాజన్ సినిమాటోగ్రాపర్ గా పనిచేసారు.

click me!