
బిగ్ బాస్ రియాల్టీ షో వల్ల అన్ని భాషల్లో ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. రకరాల గొడవలు, దాడుల వరకూ వెళ్తున్నాయి. కొన్నిసందర్భాల్లో అయితే మంచిగ ఉన్నవారు కూడా ఈ షో వల్ల విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ వల్ల ఓ స్టార్ కపూల్ విడాకులు తసీుకోబోతున్నారు. ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్ రచ్చ కొనసాగుతూ ఉండగానే... అటు హిందీ బిగ్ బాస్ లో మరో రచ్చకు తెరతీశారు. తెలుగు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు విన్నర్ ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ కారణంగాప్రభుత్వ ఆస్తులు ద్వంసం అయ్యాయి. దాంతో విన్నర్ ప్రశాంత్ తో పాటు మరో 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచారు.
ఇక ఇది ఇలా ఉండగా..తెలుగు బిగ్ బాస్ మాత్రమే అన్ని భాషల్లో బిగ్ బాస్ రచ్చ కొనసాగుతూనే ఉంది. హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రసారమవుతుంది. అయితే అన్ని భాషల్లోనూ ఈ షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ షోను బ్యాన్ చేయాలని చాలా సంస్థలు పోరాటలు కూడా చేస్తున్నారు. మన తెలుగులోకూడా కింగ్ నాగార్జునపై ఎన్ని విమర్శలు వచ్చినా అవేం పట్టించుకోకుండా షో నడిపిస్తున్నారు టీమ్.
ఇక బిగ్‌బాస్ వల్ల చాలామంది స్టార్స్ మంచి స్నేహితులు అయ్యారు... మరికొంత మంది బద్ద శత్రువులు గామారిపోతుంటారు. కాని కొన్ని సందర్భాల్లో ప్రేమికులను,భార్య భర్తలను కూడా విడదీస్తోంది బిగ్ బాస్. తాజాగా ఓ జంట బిగ్‌బాస్ కారణంగా ఏకంగా విడాకులు తీసుకునేవరకూ వెల్ళారు. అది కూడా హౌస్ లోనే..? వారి రెండేళ్లు వైవాహిక బంధంలో బిగ్‌బాస్ చిచ్చుపెట్టింది.
బాలీవుడ్ బుల్లితెర ఫేమస్ నటి అంకితా లోఖండే.. విక్కీ జైన్.. ఈ ఇద్దరు హిందీలో బిగ్ బాస్ 17 సీజన్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. అంకితా లోఖండే.. పవిత్ర రిష్తా సీరియల్ ద్వారా పాపులర్ అయింది. దివంగత యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమాయణం, బ్రేకప్ తో నిత్యం వార్తలలో నిలుస్తూండేది. అంకితా లోఖండే డిసెంబర్ 2021లో వ్యాపారవేత్త విక్కీ జైన్‌ను వివాహం చేసుకుంది.
ఈ ఏడాది అక్టోబర్‌లో ఇద్దరూ కలిసి బిగ్ బాస్ 17 హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే హౌస్ లోకి వెళ్లినప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తన భార్య అంకితా పట్ల విక్కీ చిన్నచూపు చూడడం.. ఇతర కంటెస్టెంట్స్ అందరి మధ్య తన భార్యను అవమానించడంపై విక్కీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన భర్త విక్కీని విడాకులు కావాలని కోరింది అంకితా. దాంతో ఈ విషయం అంతట సంచలనంగా మారింది. బిగ్ వల్లే ఓ జంటవిడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.