
సలార్ తో సాలిడ్ కమ్ బ్యాక్ ప్లాన్ చేశాడు ప్రభాస్. హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ దెబ్బ గట్టిగా తగిలింది రెబల్ స్టార్ కు.. అందుకే.. ఈసారి ఏ హడావిడి లేకుండా.. ఆర్బాటం లేకుండా.. సైలెంట్ గా కోత మొదలెట్టాడు. బాలయ్య సినిమాలో డైలాగ్ లా.. రాత రాసే వాడు వచ్చినా.. సలార్ కలెక్షన్స ను ఆపలేడేమో అన్నట్టుగా రచ్చ స్టార్ట్ అయ్యింది. ఇక ప్రభాస్ కు ఈసినిమాతో బిగ్ రిలీజ్ లభించిందనేచెప్పాలి. మరి కలెక్షన్స్ ను బట్టి ప్రభాస్ ఎంత వరకూ సాధించాడు అనేది తెలుస్తుంది. సలార్ మాత్రం ప్రమోషన్లు లేకుండా.. కామ్ గా వినయంగా థియేటర్లోకి వచ్చి.. రచ్చ రచ్చ చేస్తున్నాడు.
ఈసినిమాకు ప్రీరిలీజ్ కూడా చేయలేదంటే..సలార్ సినిమా విషయంలో ఎంత ఆలోచించి ఉంటారు మేకర్స్. ఇక వారుఅనుకున్న టార్గెట్ సాధిస్తారా లేదా..? అనేది ముందు ముందు తెలుస్తుంది. అయితే సలార్ రిలీజ్ హడావిడిలో.. భాగంగా ఈమూవీ ఓటీటీ పార్ట్నర్ తో పాటు.. స్ట్రీమింగ్ సంగతులు కూడా వైరల్ అవుతున్నాయి. సలార్ ను బుల్లితెరపై ఏ ప్లాట్ ఫార్మ్ లో చూడాలి. ఓటీటీ డీల్ ఎవరికి ఫిక్స్ అయ్యింది. ఎంతకు అమ్ముడు పోయింది. ఎప్పటి నుంచి సలార్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎక్కబోతుంది అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది.
Salaar Twitter Review: సలార్ మూవీ ట్విట్టర్ రివ్యూ, ప్రభాస్ సాలిడ్ కమ్ బ్యాక్.. ఇక రచ్చ రచ్చే...
పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవేటెడ్ మూవీ గా సలార్ రిలీజ్ అయ్యింది. ఈరోజు (డిసెంబర్ 22) క్రిస్మస్ హాలిడేస్ సందర్భంగా మూవీ రిలీజ్ అయ్యింది. అయితే సలార్ ఓటీటీ హక్కులు భారీ మొత్తం పలికినట్లు మరోసారి వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈమూవీని నెట్‌ఫ్లిక్స్.. సంస్థ భారీ మొత్తంలో చెల్లించి డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. సలార్ ను 160 కోట్లకు ఈ సంస్థ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సలార్ ను ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.
అయితే సినిమా వాళ్లు పెట్టుకున్న రూల్స్ ప్రకారం. చిన్నదైనా..పెద్దదైనా సినిమా రిలీజ్ అయిన మూడు నెలల తరువాతే ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కాని ఆ విషయాన్నిఎవరూ పట్టించుకోవడం లేదు. పెద్ద హీరోలు నటించి.. థియేటర్లలో ప్లాప్అయిన సినిమాలను రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి తోలేస్తున్నారు. చిన్న సినిమాలయితే.. ఇలా రిలీజ్ అయ్యి.. అలా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈక్రమంలో సలార్ మాత్రం ఇప్పట్లో స్ట్రీమింగ్ అయ్యే పరిస్థితి ఉందడంటున్నారు.
ఎందుకంటే సలార్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. కన్నడ దర్శకుడు, తెలుగు హీరో, మలయాళ నటుడు కీ రోల్ చేశాడు.. ఈలెక్కన సౌత్ లో సలార్ బీభత్సం సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఈమూవీ భారీ ఎత్తున కలెక్ట్ చేసిన తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది.