Anupama Parameswaran: అనుపమా పరమేశ్వరన్ బాలీవుడ్ ఎంట్రీ..? నిజమెంత..?

Published : Dec 22, 2023, 05:46 AM IST
Anupama Parameswaran: అనుపమా పరమేశ్వరన్ బాలీవుడ్ ఎంట్రీ..? నిజమెంత..?

సారాంశం

సౌత్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది మలబారు అందం అనుపమా పరమేశ్వరన్. తాజాగా ఆమె బాలీవుడ్ గుమ్మం తొక్కబోతోంది అన్న న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో నిజంఎంత..?   

అనుపమా పరమేశ్వరన్ అవ్వడానికి మలయాళ కుట్టి అయినా..? అచ్చతెలుగు అమ్మాయిలా మనతెలుగువారితో కలిసిపోయింది. టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ.. సందడి చేస్తోంది.   2024లో అనుపమ నటించిన సినిమాలు థియేటర్లకు వరుసకట్టబోతున్నాయి. కెరీర్ బిగినింగ్ లో  ఒన్లీ క్యారెక్టర్ రోల్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చిన అనుపమా. ఆతరువాత హీరోయిన్ గా తన సత్తాచాటుతోంది. రూటు మాత్రం టాలీవుడ్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తోంది. 

ఈ సంక్రాంతి బరిలో సందడి చేయడానికి ముస్తాబుతోంది అనుపమా పరమేశ్వరన్. ఆమె హీరోయిన్‌గా నటించి ఈగిల్‌ సినిమా సంక్రాంతి రిలీజ్ బరిలో ఉంది. టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ జంటగా ఈసినిమాలో నటించి మెప్పించబోతుంది బ్యూటీ.  అయితే ఈసినిమాలో అనుపమది ఇంపార్టెంట్ రోల్ అని.. అసలు హీరోయిన్ కావ్యథాపర్ అంటున్నారు సినిమా జనాలు. ఈసినిమాతో పాటు అనుపమా ఖాతాలో మరో సినిమా కూడా ఉంది. 

తెలుగులో ఈగల్ తో పాటు.. సిద్దుస్వేర్ లో  కూడా నటిస్తోంది బ్యూటీ. ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.  వచ్చే ఏడాది ఈసినిమా రిలీజ్ కాబోతోంది. ఇక తెలుగులో ఈ రెండు సినిమాలతో వస్తున్న అనుపమ, తమిళ్‌లో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమా చేస్తున్నారు. 2024లో సౌత్‌ వేవ్ ను గట్టిగా చూపించబోతున్నఅనుపమకు..నార్త్ నుంచిపిలుపు వచ్చిందట. 

బాలీవుడ్ నుంచి అనుపమకు అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ యంగ్ హీరోల సరసన నటించాలంటూ మేకర్స్ నుంచి పిలుపు కూడా వచ్చిందట. కాని అనుపమా ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోనట్టు తెలుస్తోంది. ఈ ఏడాది సౌత్ బార్డర్ దాటకుండా  ఉండాలని అనుకుంటుందట. వీలైతే..  2025లో బాలీవుడ్ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తుందట అనుపమా. ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కాని..నెట్టింట్లో మాత్రం వైరల్ అవుతోంది. 


 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?