ఉత్కంఠకు తెర, విజయకాంత్ ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన!

Published : Dec 11, 2023, 01:41 PM IST
ఉత్కంఠకు తెర, విజయకాంత్ ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన!

సారాంశం

నటుడు విజయకాంత్ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు కీలక ప్రకటన చేశాయి. విజయకాంత్ పూర్తిగా కోలుకోవడంతో పాటు డిశ్చార్జ్ చేస్తున్నట్లు వెల్లడించారు.   

దాదాపు మూడు వారాలుగా నటుడు, డీఏండీకే అధినేత విజయకాంత్ మియత్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో విజయకాంత్ కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. సుదీర్ఘకాలం విజయకాంత్ ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో పుకార్లు వ్యాపించాయి. ఆయన మరణించాలంటూ కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 

ఈ పుకార్లపై విజయకాంత్ సతీమణి ప్రేమలత స్పందించారు. విజయకాంత్ కోలుకుంటున్నారు. ఆయన గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు. మరి కొద్ది రోజులు విజయకాంత్ కి చికిత్స అవసరం అని ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. పూర్తిగా కోలుకున్న విజయకాంత్ నేడు డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు మియత్ ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. 

విజయకాంత్ తిరిగి కోలుకున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విజయ్ కాంత్ ప్రస్తుత వయసు 71 ఏళ్ళు. కొన్నాళ్లుగా ఆయన తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంటికే పరిమితం అవుతున్న విజయకాంత్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. విజయకాంత్ 90లలో స్టార్ హీరోగా ఉన్నారు. ఆయన సినిమాలకు తెలుగులో కూడా మార్కెట్ ఉండేది. 
 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు