తెలంగాణ ఎమ్మెల్యే జీవిత చరిత్రలో స‌ముద్ర‌ఖ‌ని

By Surya PrakashFirst Published Dec 11, 2023, 10:58 AM IST
Highlights

ఆకాశాన్ని తాకే ఆశయం, గుండె గొంతుకలోంచి పుట్టుకొచ్చే భావోద్వేగం, కష్టమైన, నిష్టూరమైనా సైద్ధాంతిక ఆలోచనా విధానమే అప్పట్లో రాజకీయ నేపథ్యంగా....


బయోపిక్ సినిమాలు ఏ మేరకు జనాలు ఆదరిస్తారు అనేది ప్రక్కన పెడితే అలాంటి సినిమాలు నిర్మాణంలో మాత్రం ఎప్పుడూ ఆసక్తిని రేపుతుంటాయి. మరీ ముఖ్యంగా నిజ జీవితంలో ఉన్నది ఉన్నట్టుగా తీశారా? ఏమైనా సినిమాటెక్ లిబర్టీ కలిపి చూపిస్తున్నారా? అసలు వాస్తవాలు బయటకు చూపిస్తారా? అనే ఆలోచనలతో జనాలు ఆ బయోపిక్ సినిమాలను చూస్తుంటారు.  ఇప్పటికే చాలా మంది బయోపిక్ లు తెరకెక్కాయి. ఈ క్రమంలో అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు, పేదల పాలిట పెన్నిది అయిన గుమ్మడి నర్సయ్య బయోపిక్ తెరకెక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు వేరే వాళ్లు చేస్తున్నారో లేక వాళ్లే చేసే ప్రాజెక్టుకో కానీ లీడ్ రోల్ కు సముద్రఖని అడుగుతున్నట్లు సమాచారం.

ఆకాశాన్ని తాకే ఆశయం, గుండె గొంతుకలోంచి పుట్టుకొచ్చే భావోద్వేగం, కష్టమైన, నిష్టూరమైనా సైద్ధాంతిక ఆలోచనా విధానమే అప్పట్లో రాజకీయ నేపథ్యంగా ఉండేది అంటున్నారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. 

Latest Videos

వామపక్ష ఉద్యమమే జీవితంగా పనిచేసిన సీపీఐ (ఎంఎల్‌) పార్టీ అంటే గుర్తుకొచ్చేది గుమ్మడి నర్సయ్యే. విలువలు, నిరాడంబర జీవితం ఆయన సొంతం. ఇల్లెందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. నాటి నుంచి ఇప్పటివరకు అత్యంత సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు. అప్పటికి ఇప్పటికి ఎన్నికల సరళి పూర్తిగా మారిపోయిందని.. పదునైన ఓటు ఆయుధం పచ్చనోట్ల మధ్య మొద్దుబారిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూంటారు.  ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం అపహాస్యం చేస్తోందని వాపోతున్నారు. 

‘‘1983 నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అప్పట్లో ప్రజల్లో మమేకమైతేనే పార్టీలు సీట్లు ఇచ్చేవి అప్పట్లో. పోటీచేసే వ్యక్తిని జనం అదే రీతిలో సొంతం చేసుకునే వాళ్లు. పోస్టర్లు, గోడమీద రాతలు అవే ఆ కాలంలో అతిపెద్ద ఎన్నికల ఖర్చు. ప్రచారం కోసం వచ్చే వాళ్లకు ప్రజలే అన్నంపెట్టే వారు. ఆశ్రయం కల్పించేవారు. అంతా కలిపి రూ.లక్షన్నర వరకూ ఎన్నికల ఖర్చు ఉండేది. ప్రజలు పైసలు ఆశించేవాళ్లు కాదు. 1994 నుంచి రాజకీయాలు మారిపోయాయి. కోట్లు గుమ్మరిస్తేనే గెలుస్తామని పార్టీలు కూడా భావిస్తున్నాయి. ప్రజలకు, నాయకులకు మధ్య ధన సంబంధం ఏర్పడింది. రాజకీయాలు కలుషితమయ్యాయి. రూ.కోట్లు ఖర్చుపెట్టి గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత తమకు ఏది లాభమో దాన్నే అనుసరిస్తున్నారు. అవసరమైతే పార్టీలు మారుతున్నారు అంటున్నారు ఆయన. 

ప్రజల కోసం ప్రజల కొరకే నా జీవితం అంటూ ముందుకు సాగిన గుమ్మడి నర్సయ్య బయోపిక్ భావితరాలకు స్పూర్తిదాయకంగా నిలిచేలా తెరకెక్కించాల్సిన భాధ్యత ఉంది.  కొత్త ద‌ర్శ‌కుడు ఈ బ‌యోపిక్‌కు మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్న‌ట్లు చెప్తున్నారు.

click me!