గూఢచారి 2 షూటింగ్‌ స్టార్ట్.. అనౌన్స్ చేసిన ఏడాదికి సినిమా ప్రారంభించిన అడవిశేషు

Published : Dec 11, 2023, 01:14 PM IST
గూఢచారి 2 షూటింగ్‌ స్టార్ట్.. అనౌన్స్ చేసిన ఏడాదికి సినిమా ప్రారంభించిన అడవిశేషు

సారాంశం

అడవి శేష్‌ హీరోగా `గూఢచారి 2` సినిమాని ప్రకటించింది దాదాపు ఏడాది కావస్తుంది. ఇన్నాళ్లకి ఈ మూవీని ప్రారంభించారు. నేటి నుంచి సినిమా షూటింగ్‌ ని స్టార్ట్ చేశారు.

అడవి శేషు అంటే కాప్‌ సినిమాలకు కేరాఫ్‌ అనే ముద్ర పడింది. `క్షణం`, `గూఢచారి`, `మేజర్‌`, `హిట్‌ 2` చిత్రాలన్నీ ఇలా పోలీస్‌, ఆర్మీ నేపథ్యంలోనే సాగాయి. అడవి శేష్‌ వాటికి మాత్రమే సెట్‌ అవుతారనే టాక్‌ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. `గూఢచారి`కి సీక్వెల్‌ చేస్తున్నారు. `గూఢచారి 2` సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ తాజాగా షూటింగ్‌ ప్రారంభించారు. 

ఈ ఏడాది జనవరిలో `గూఢచారి2` ని అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. దర్శకుడిని పరిచయం చేశారు. ఎడిటర్‌ వినయ్‌ కుమార్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. సినిమా చేయబోతున్నట్టు ఆ సమయంలోనే అనౌన్స్ చేశారు. కానీ దాదాపు ఏడాది గ్యాప్‌తో సినిమా షూటింగ్‌ స్టార్ట్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఇన్నాళ్లు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ చేశారా? లేక మధ్యలో ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

స్పై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. త్రినేత్ర అనే వింగ్‌లో అడవిశేష్‌ పని చేయబోతున్నారు.ఏజెంట్‌ 116 గా ఆయన కనిపించబోతన్నారు. ఇందులో బనితా సందు హీరోయిన్‌గా చేస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైనర్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు