Taraka Ratna: విషాదం.. నందమూరి తారకరత్న కన్నుమూత

Published : Feb 18, 2023, 09:46 PM ISTUpdated : Feb 18, 2023, 09:53 PM IST
Taraka Ratna: విషాదం.. నందమూరి తారకరత్న కన్నుమూత

సారాంశం

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.  టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) కొద్ది క్షణాల ముందు కన్నుమూశారు. గత ఇరవై రెండు రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.నందమూరి హీరో తారకరత్న (Taraka Ratna)(39) కన్నుమూశారు.  గత 22 రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో నందమూరి ఫ్యామిలీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌ దిగ్భ్రాంతికి గురయ్యింది. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని అంతా భావించారు. కానీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శనివారం ఆయన ఆరోగ్యం మరోసారి విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేదు. తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

రీసెంట్ గా నారా లోకేష్ నిర్వహించిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే తారకరత్నను కుప్పం ఆస్ప్రత్రికి తరలించి  చికిత్సను అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెంగుళూరుని నారాయణ హృదయాలయకు తరలించారు. తారకరత్నని కాపాడేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించారు.విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం కూడా వచ్చింది. అయినా ఫలితం లేకపోయింది. 

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దిగ్గజ నటుడు సీనియర్ ఎన్టీఆర్ మనువడైన తారకరత్న 1983లో హైదరాబాద్ లో  జన్మించారు. ఇక నటుడిగా 2002లో వచ్చిన ‘ఒకటో నంబర్ కుర్రాడు’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. చిత్రానికి రెస్పాన్స్ రావడంతో పాటు తారకరత్నకూ మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత ‘యువరత్న’, ‘భద్రాది రాముడు’, ‘అమరావతి’, తదితర చిత్రాలతో అలరించారు. చివరిగా ‘S5 నో ఎగ్జిట్’ కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారి సినిమాలు చేస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ బిజీ కాబోతున్నారు. తమ కుటుంబ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోనే చేరి రాజకీయాల్లో యాక్టివ్‌ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలోనూ ఉన్నారు. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్