ఢమరుకం పట్టిన చిరంజీవి.. థియేటర్స్ లో శివతాండవమే, భోళా శంకర్ నుంచి స్పెషల్ వీడియో

Published : Feb 18, 2023, 06:46 PM IST
ఢమరుకం పట్టిన చిరంజీవి.. థియేటర్స్ లో శివతాండవమే, భోళా శంకర్ నుంచి స్పెషల్ వీడియో

సారాంశం

వాల్తేరు వీరయ్య చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత మెగా అభిమానుల ఫోకస్ భోళా శంకర్ పై పడింది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత మెగా అభిమానుల ఫోకస్ భోళా శంకర్ పై పడింది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మెహర్ రమేష్ కి సరైన సక్సెస్ లేదు. కానీ అతడి టేకింగ్ బావుంటుంది అనే నమ్మకంతో చిరు మెహర్ రమేష్ కి అవకాశం ఇచ్చారు. 

వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. నేడు మహా శివరాత్రి కావడంతో చిత్ర యూనిట్ చిన్న టీజర్ లాంటి సాంగ్ బిట్ వదిలారు. 

ఈ వీడియోలో చిరంజీవి ఢమరుకం చేత బట్టి డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న ఫోజు అదిరిపోయింది. బ్యాగ్రౌండ్ లో జై బోలో భోళా శంకర్ అంటూ సాంగ్ వినిపిస్తోంది. ఇటీవల చిరంజీవి 200 మంది డ్యాన్సర్లతో సాంగ్ చేసారు అని న్యూస్ వచ్చింది. ఆ సాంగ్ ఇదే కావచ్చు. మొత్తంగా చిరు తన స్టెప్పులతో థియేటర్స్ లో శివ తాండవం చేయబోతున్నట్లు అర్థం అవుతోంది. 

ఇంద్ర చిత్రంలో శివుడిపై భంభం బోలే అంటూ చేసిన సాంగ్ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ అంతకి మించేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శివరాత్రి కానుకగా చిత్ర యూనిట్ ఈ సాంగ్ టీజర్ వదిలారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?