దొంగకు సపోర్ట్ చేసిన సోనూసూద్, రెండు గా విడిపోయిన నెటిజన్లు.. ఏమంటున్నారంటే..?

By Mahesh JujjuriFirst Published Apr 13, 2024, 7:14 PM IST
Highlights

సోషల్ మీడియాలో మరోసారి ట్రోలింగ్ కు గురయ్యారు బాలీవుడ్ నటుడు, సామాజిక సేవా కార్యకర్త సోనూసూద్. ఆసారి ఆయనకు విచిత్రమై పరిస్థితి ఎదురయ్యింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? 
 

కరోనా కష్టకాలం నుంచి వరుసగా ఎంతో మందికి సాయం చేశారు ఇండియన్ యాక్టర్ సోనూసూద్.  వేలాదిమందికి అనేక రకాలుగా సహాయం చేశాడు. కరోనా అనే కాదు.. చదవుకోవాలని ఉండి ఆర్ధికంగా ఇబ్బంది ఉన్నా.. పేదరికంలో ఉన్నా.. ఇల్లు లేక ఇబ్బందిపడుతున్నా.. వ్యవసాయానికి ఇబ్బంది పడుతున్నా.. ఇలా ఏ ఆపద అయినా సరే నేనున్న అంటూ ఆదుకున్నాడు సోనూసూద్. 

 సాయం కోరినవారిని లేదనకుండా అక్కున చేర్చుకున్న సోనూసూద్ కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. సినిమాల్లో విలన్ పాత్రలు వేసేసోనూసూద్ కు.. రియల్ గాహీరోగామారాడు. రియల్ హీరో అన్న బిరుదు కూడా పొందాడు. అంతే కాదు ఆయన చేసిన పనికి దేశంలో చాలా చోట్ల గుడి కట్టిపూజించారు. అంతే కాదు.. కొన్నిసందర్భాల్లో ఆయన ట్రోలింగ్ కు కూడా గురయ్యారు. ఈక్రమంలో సోనూసూద్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. మరోసారి ట్రోలింగ్ కు గురయ్యారు. దేనికంటే..? 

ఆ విషయంలో శ్రీదేవిని మించిపోయిన జాన్వీ కపూర్, మరీ అంత అవసరమా..? అంటున్న నెటిజన్లు

రీసెంట్ గా  ఓ కస్టమర్ ఇంటి బయట ఉన్న బూట్లను చోరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్‌ వీడియో రెండ్రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ డెలవరీ బాయ్‌కు సోనూ సూద్ ఇప్పుడు అండగా నిలిచాడు. బూట్లు చోరీ చేసిన అతడిపై కంపెనీ కానీ, అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరాడు. అతను ఏ పరిస్థితుల్లో ఆ పని చేశాడో అర్ధం చేసుకోవాలి అని ఆయన ఓ ట్వీట్ ను పెట్టారు. సోనూసూద్ ట్వీట్ లో ఏం రాసుకొచ్చారంటే..? 

స్టైలిష్.. హ్యాండ్సమ్ లుక్ లో రామ్ చరణ్, చెన్నైలో ఎయిర్ పోర్ట్ లో సింహంలా దిగిన గ్లోబల్ స్టార్..

‘‘స్విగ్గీ డెలివరీ బాయ్ డెలివరీ సమయంలో ఎవరివైనా షూ చోరీ చేస్తే, ఆయనపై చర్యలు తీసుకోవడానికి బదులుగా కొత్త షూ కొనివ్వండి. అతడికి అవి అవసరం కావొచ్చు. కాబట్టి దయగా ఉండండి’’ అని ఎక్స్ చేశాడు. సోనూ సోద్ చేసిన ఈ ట్వీట్ తో పాటు సూచనపై నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఈ ట్వీట్ తో నెటిజన్లు రెండుగా విడిపోయారు. ఒక వర్గం సోనూకు సపోర్ట్ చేస్తుంటే.. మరో వర్గం మాత్రం ఆయను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. 

జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా.. బ్యాగ్ లో అది ఉండాల్సిందేనట. ఏంటో తెలుసా..

దొంగతనం ఏ రూపంలో ఉన్నా అది మంచిది కాదని..  అతడిపై చర్యలు తీసుకోవద్దని చెప్పడం వరకు ఓకే కానీ, ఇలాంటి జస్టిఫికేషన్‌లు ఇవ్వడం సరికాదని మరికొందరు నెటిజన్లు సోనూసూద్ పై  మండిపడుతున్నారు. పేదరికం, అవసరాలు కారణంగా చేసే చోరీని సమర్థించడం సరికాదని అంటున్నారు. అంతే కాదు ఇలా దొంగతనం చేస్తే.. ఇంతకంటే పేదవారు ఉన్నారు వారు ఏం చేయాలి.. కష్టపడి పనిచేసుకుని సంపాదించుకోవాలి కాని..ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ సోనూసూద్ కు కూడా గట్టిగా ఇచ్చేస్తున్నారు. 

 

click me!