Simbu Hospitalized : హాస్పిటల్ లో హీరో శింబు.. ఆందోళనలో అభిమానులు...

Published : Dec 12, 2021, 11:17 AM ISTUpdated : Dec 12, 2021, 11:31 AM IST
Simbu Hospitalized : హాస్పిటల్ లో హీరో శింబు.. ఆందోళనలో అభిమానులు...

సారాంశం

తమిళ స్టార్ హీరో శింబు కొన్ని హెల్త్ ఇష్యూస్ తో.. సడెన్ గా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. తమ అభిమాన స్టార్ కు ఏమైయ్యిందా.. అని కంగారు పడుతున్నారు.   

తమిళ స్టార్ హీరో "శింబు"(Simbhu) అనారోగ్య కారణాలతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. శింబు సడెన్ గా హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడంతో అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది. అయితే శింబుకు కరోనా వచ్చిందని.. అందుకే హస్పిటల్ లో జాయిన్ అయ్యారంటూ..చెన్నై ఫిల్మ్ సర్కిల్ లో న్యూస్ వైరల్ అయ్యింది. కాని అందులో నిజం లేదని, కరోనా టెస్ట్ లో శింబుకు నెగెటీవ్ వచ్చినట్టు తెలిసింది. 


అయితే అసలు Simbhu హాస్పిటల్ లో ఎందకు జాయిన్ అయ్యారు అని ఆరా తీయ్యగా.. ఆయన వైరల్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నట్టు తెలిసింది. జ్వరంతో పాటు గొంతు ఇన్ ఫెక్షన్.. ఇతర సీజనల్ ప్రాబ్లమ్స్ తో తమిళ హీరో ఇబ్బంది పడుతున్నారట. ఈ కారణంతోనే శింబు హాస్పిటల్ లో జాయిన్ అయ్యి.. ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజులు ఆయన హాస్పిటల్ లోనే ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటారని సమాచారం. 

Also Read : Ntr Costly Watch: తారక్ కాస్ట్లీ వాచ్.. ఎంతో తెలుసా..? త్రివిక్రమ్ అప్పుడు ఊరికే చెప్పలేదు...
 శింబు  ప్రస్తుతం "వెందు తనిందదు కాదు" (Vendhu Thanindhathu Kaadu) 'సినిమాలో నటిస్తున్నారు. కొన్ని వారాలుగా నిర్విరామంగా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు తమిళ హీరో. దీని కారణంగానే ఆయనకు ఇన్ ఫెక్షన్ వచ్చినట్టు సమాచారం. కొన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించినట్టు తెలుస్తోంది. శింబు అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. 


"వల్లభ" "మన్మథ" లాంటి సినిమాలతో టాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాధించుకున్నారు శింబు. లవ్ స్టోరీస్ తో బాగా ఫేమస్ అయ్యాడు తమిళ స్టార్ హీరో. రీసెంట్ గా మానాడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు శింబు. తనను ఇండస్ట్రీలో చాలా మంది ఇబ్బంది పెడుతున్నారంటూ.. ఓ సందర్భంలో కన్నీరు పెట్టుకున్నారు.శింబు నటించిన మానాడు సినిమాను"ది లూప్ " పేరుతో  తెలుగులో కూడా రిలీజ్ చేశారు. 

Also Read : RRR: ట్రిపుల్ ఆర్ హీరోలకు రాజమౌళి టార్చర్.... తట్టుకోలేకపోయామన్న హీరోలు....

PREV
click me!

Recommended Stories

హ్యాపీడేస్ సీక్వెల్ కు రంగం సిద్దం చేస్తోన్న శేఖర్ కమ్ముల.. పార్ట్ 2లో హీరోలు ఎవరంటే?
Trisha Home Tour : చెన్నై, హైదరాబాద్‌లో ఇంద్రభవనాల్లాంటి త్రిష ఇళ్లను చూశారా? ఎలా ఉంటాయంటే?