‘భగవంత్ కేసరి’ కీలక అప్డేట్.. ఆయన షూటింగ్ పూర్తి చేసుకున్నారు..

Published : Aug 14, 2023, 07:53 PM ISTUpdated : Aug 14, 2023, 07:56 PM IST
‘భగవంత్ కేసరి’ కీలక అప్డేట్.. ఆయన షూటింగ్ పూర్తి చేసుకున్నారు..

సారాంశం

బాలయ్య - అనిల్ రావిపూడి సినిమా ‘భగవంత్ కేసరి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. స్టార్ కాస్ట్ ఇందులో నటిస్తున్నారు. తాజాగా నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ తన పోర్షన్ ను పూర్తి చేసుకున్నట్టు అప్డేట్ అందించారు.   

నందమూరి నటసింహం, సీనియర్ నటుడు బాలకృష్ణ (Balakrishna)  టాలెంటెడ్ డైరెక్టర్  అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari).  షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. దసరాకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించేలా షెడ్యూల్ ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే కీలక సన్నివేశాలను చిత్రీకరించింది యూనిట్. మిగిలినా పార్ట్ ను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. 

అయితే, ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ (Arjun Rampal)  ‘భగవంత్ కేసరి’లోని తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్ నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడు సౌత్ సినిమాలపైనా ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ తెలుగు చిత్రాలతోనే దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. భగవంత్ కేసరితో పాటు పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’లోనూ నటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ‘భగవంత్ కేసరి’ చిత్రంలో ఆయన పాత్ర పేరు రాహుల్ సంఘ్వి అని యూనిట్ వెల్లడించారు. విలన్ గా అలరించబోతున్నారు. ఆయన పాత్ర అతి భయంకరంగా ఉంటుందని, ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని తెలిపారు. లేటెస్ట్ అప్డేట్ తో పాటు అర్జున్ రాంపాల్, బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలిసి ఉన్న ఎనర్జిటిక్ ఫొటోలను యూనిట్ పంచుకుంది. ఈ చిత్రం దసరా విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. కాజల్ అగ్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది.

ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే అందించిన అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో సినిమా ఎప్పుడూ వస్తుందా అని అభిమానులతోపాటు, ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే