`రోలెక్స్` కథతో సినిమా.. కన్ఫమ్‌ చేసిన సూర్య..

Published : Aug 14, 2023, 07:08 PM IST
`రోలెక్స్` కథతో సినిమా.. కన్ఫమ్‌ చేసిన సూర్య..

సారాంశం

దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సూర్య పాత్రని సృష్టించారు. ఈ పాత్రకి ఇప్పుడు ఓ కథ ఉందట. దాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు.

ప్రస్తుతం ఇండియన్‌ సినిమాలో యాక్షన్‌ సినిమాల జోరు సాగుతుంది. యాక్షన్‌ ప్రధానంగా వచ్చే మూవీస్‌ రికార్డులు షేక్ చేస్తున్నాయి. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నాయి. `పుష్ప`, `ఆర్‌ఆర్‌ఆర్`, `కేజీఎఫ్‌`, `విక్రమ్‌`, `పఠాన్‌` సినిమాలే అందుకు నిదర్శనం. తాజాగా రజనీకాంత్‌ నటించిన `జైలర్‌` సైతం అదే విషయాన్ని నిరూపించింది. ఇది నాలుగు రోజుల్లో మూడు వందల కోట్లకి రీచ్‌ అయ్యింది. దీంతో యాక్షన్‌ సినిమాలకు క్రేజ్‌, డిమాండ్‌ పెరిగింది. 

ఇక గతేడాది తమిళంలో వచ్చిన `విక్రమ్‌` మూవీ సరికొత్త ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. యాక్షన్‌ సినిమాలకు కొత్త అర్థాన్నిచ్చింది. కంటెంట్‌, బీజీఎం, స్టార్ కాస్టింగ్‌ ఈసినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. ఇది నాలుగు వందల కోట్లు వసూలు చేసింది. ఇందులో సూర్య నటించిన `రోలెక్స్` అనే కోమియో రోల్‌ హైలైట్‌గా నిలిచింది. సినిమాకి పెద్ద బూస్ట్ ఇచ్చింది. అంతేకాదు చివర్లో వచ్చి సినిమా క్రెడిట్‌ మొత్తాన్ని కొట్టేశాడు సూర్య. 

దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సూర్య పాత్రని సృష్టించారు. ఈ పాత్రకి ఇప్పుడు ఓ కథ ఉందట. దాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే `విక్రమ్‌ 2` కూడా ఉంటుందని ప్రకటించారు. అయితే అది విక్రమ్‌తోపాటు రోలెక్స్ పాత్ర ప్రధానంగా ఉంటుందని భావించారు. అయితే లేటెస్ట్‌ సమాచారం మేరకు `రోలెక్స్` పాత్ర ప్రధానంగానే సినిమా చేయబోతున్నారట. తాజాగా ఈ విషయాన్ని ఏకంగా సూర్య వెల్లడించడం విశేషం. ఇటీవల ఆయన తన అభిమానులతో ముచ్చటించారు. ఇందులో లోకేష్‌ తనకు `రోలెక్స్` పాత్రతో కూడిన కథని నెరేట్‌ చేశాడట. అది బాగుందని, త్వరలో ఆ సినిమా పట్టాలెక్కుతుందని వెల్లడించారు. దీంతో సూర్య అభిమానుల్లోనే కాదు, సాధారణ ఆడియెన్స్ లోనూ ఆసక్తి ఏర్పడింది. 

`విక్రమ్‌` సినిమాలో రోలెక్స్ పాత్రకి దక్కిన హైప్‌, క్రేజ్‌ మామూలు కాదు. సినిమానది నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్ళింది. అదే రేంజ్‌లో సినిమా ఉంటే ఇది సంచలనాలకు కేరాఫ్‌గా నిలవబోతుందని అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సూర్య.. `కంగువా` చిత్రంలో నటిస్తున్నారు. భారీ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ మూవీ రూపొందుతుంది. 14వ సెంచరీ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో తన తెగ జనం కోసం పోరాడే యోధుడిగా సూర్య కనిపిస్తున్నారు. ఆయన లుక్‌ అత్యంత భయంకరంగా ఉంది. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ కాబోతుంది. ఇందులో దిశా పటానీ కథానాయికగా నటిస్తుండగా, దీపికా పదుకొనె గెస్ట్ గా చేయనుందని సమాచారం. 

మరోవైపు ఈ సినిమా తర్వాత తన 43వ మూవీని స్టార్ట్ కాబోతుంది. అక్టోబర్‌లో దీన్ని ప్రారంభించనున్నారు. అలాగే వెట్రిమారన్‌తో `వాడివాసల్‌` పేరుతో సినిమా చేస్తున్నారు సూర్య. ఇది ప్రస్తుతం వెట్రి మారన్‌ చేస్తున్న `విడుదలై2` తర్వాత ప్రారంభం కానుంది. ఆ తర్వాత `రోలెక్స్` తెరపైకి ఎక్కనుందట. ఆ తర్వాత `ఇరుంబు కై మాయావి` మూవీ చేయబోతున్నారు సూర్య. ఇలా అలాగే తెలుగు దర్శకుడు చందూ మొండేటితోనూ ఓ సినిమా చేయబోతున్నారు సూర్య. ఇలా నాలుగైదు సినిమాలతో సూర్య మూడు నాలుగేళ్లు లాక్‌ అయిపోయారు. ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్‌ `లియో` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఎవరితో ఉంటుందనేది తెలియాల్సి ఉంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా