ప్రకాష్‌ రాజ్‌కి తీవ్ర గాయాలు.. ధనుష్‌ సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. చికిత్స కోసం హైదరాబాద్‌కి..

Published : Aug 10, 2021, 03:32 PM IST
ప్రకాష్‌ రాజ్‌కి తీవ్ర గాయాలు.. ధనుష్‌ సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. చికిత్స కోసం హైదరాబాద్‌కి..

సారాంశం

విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌కి గాయాలయ్యాయి. ఆయన చికిత్స చేయించుకోవడానికి హైదరాబాద్‌ వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకాష్‌ రాజ్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించడం విశేషం.

విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌కి గాయాలయ్యాయి. ఆయన చికిత్స చేయించుకోవడానికి హైదరాబాద్‌ వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకాష్‌ రాజ్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించడం విశేషం. `ఒక చిన్న తప్పిదం. చిన్న ఫ్రాక్చర్‌. నా స్నేహితుడు డాక్టర్‌ గురువరెడ్డి వద్దకి సర్జరీ కోసం హైదరాబాద్‌ వెళ్తున్నా. సురక్షితమైన చేతుల్లోకి వెళ్తున్నా. నేను బాగానే ఉన్నాను. ఎవరూ చింతించకండి. మీ ఆలోచనల్లో ఉంచుకోండి` అని ట్వీట్‌ చేశారు ప్రకాష్‌ రాజ్‌. ఇప్పుడిది వైరల్‌ అయ్యింది. 

అయితే గాయాలకు గల కారణాలు తెలపలేదు. కానీ ధనుష్‌ కొత్త సినిమా షూటింగ్‌లో ఆయనకు గాయాలైనట్టు సమాచారం. చెన్నైలో జరుగుతున్న సినిమా చిత్రీకరణలో ప్రకాష్‌ రాజ్‌ చేతికి తీవ్రంగా గాయాలయ్యాయని, సాయంత్రం హైదరాబాద్‌లో సర్జరీ చేయించుకోబోతున్నారట. 

ఇదిలా ఉంటే ఇటీవల `మా` ఎన్నికల విషయంలో హాట్‌ టాపిక్‌గా మారారు ప్రకాష్‌ రాజ్‌. `మా` అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్చోబోతున్నట్టు ప్రకటించిన మొదటి వ్యక్తి ప్రకాష్‌ రాజ్‌. అంతేకాదు అంతే స్పీడ్‌గా ఆయన నా ప్యానెల్‌ని ప్రకటించారు. అదే సమయంలో ఏకంగా ప్రెస్‌మీట్‌ కూడా పెట్టి తాను ఏం చేయాలనుకున్నానో వివరించారు. 

ఆ టైమ్‌లోనే లోకల్‌, నాన్‌ లోకల్‌ విషయంలో వివాదాల్లో ఇరుక్కున్నాడు. అప్పటి నుంచి ఆయన `మా` ఎన్నికలపై మాట్లాడటం లేదు. కానీ సైలెంట్‌గా ట్విట్టర్‌ వేదికగా పరోక్షంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇటీవల `తెగేదాక లాక్కండి` అనే ట్వీట్‌ సైతం దుమారం రేపింది. ఇదిలా ఉంటే చివరగా ప్రకాష్‌ రాజ్‌.. పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌`లో లాయర్‌గా నటించి ఆకట్టుకుంటున్నారు. మరోవైపు వెబ్‌ సిరీస్‌లతోనూ ఫుల్‌ బిజీగా ఉన్నారు ప్రకాష్‌ రాజ్‌. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?