
తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి గురించి తెలియని కుర్రకారు ఉండరు. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది.
ఒక వైపు రాహుల్ సిప్లిగంజ్ తో రొమాంటిక్ వ్యవహారం సాగిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక కామెడీ స్టార్స్ షోలో అషు రెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
రాహుల్ సిప్లిగంజ్ తో మ్యూజిక్ వీడియోల్లో రొమాంటిక్ గా కనిపించడం, ఎక్స్ ప్రెస్ హరితో క్లోజ్ గా మూవ్ కావడంతో అషు రెడ్డి ప్రేమ వ్యవహారాలపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అషు రెడ్డి పోస్ట్ చేసిన లేటెస్ట్ డబ్ స్మాష్ వీడియో వైరల్ గా మారింది.
బ్రహ్మానందం డైలాగులతో అషురెడ్డి ఈ వీడియో చేసింది. 'ఆ వెధవ ఇంకా బ్రతికే ఉన్నాడా. వాడివల్లే నా జీవితం ఇలా నాశనం అయింది. చదువుకోవాల్సిన రోజుల్లో తిప్పి తిప్పి ఇలా పిప్పి చేశాడు' అంటూ ఆశు రెడ్డి చాలా ఫన్నీగా వీడియో చేసింది. ఈ వీడియోలో అషు రెడ్డి స్కూల్ యూనిఫామ్ లో కనిపిస్తోంది.
తన పక్కనే ఉన్న కో డైరెక్టర్ రాకేష్ ని ఉద్దేశిస్తూ ఫన్నీగా ఈ డైలాగ్ చెప్పింది బిగ్ బాస్ బ్యూటీ. కానీ ఇది అక్షరాలా నిజం అంటూ అషు రెడ్డి కామెంట్ పెట్టడం కొసమెరుపు, ఓ ప్రోగ్రాం షూట్ కోసం అషు రెడ్డి ఇలా స్కూల్ యూనిఫామ్ లో కనిపించింది.
అషు రెడ్డి సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది. బిగ్ బాస్ 3లో ఉన్నన్ని రోజులు అషు రెడ్డి ప్రేక్షకులకు అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా యువతలో ఆమెకు మంచి క్రేజ్ ఉంది.