Naresh:'మా' సభ్యుల సంక్షేమం కోసం ఏర్పడింది... టికెట్స్ ధరల సమస్యతో సంబంధం లేదు

By Sambi ReddyFirst Published Jan 20, 2022, 11:08 AM IST
Highlights

సీనియర్ నటుడు నరేష్ (Naresh)ఏపీ టికెట్స్ ధరల సమస్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధరల విషయంలో ఏపీ ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనతో 'మా' కు సంబంధం లేదన్నారు. అందుకే ఈ విషయంపై స్పందించలేదన్నారు. 
 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్స్ ధరలు(AP ticket prices) తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా పరిశ్రమ పెద్దలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంత తక్కువ ధరలతో థియేటర్స్ మనుగడ సాధ్యం కాదని, ముఖ్యంగా పెద్ద చిత్రాల నిర్మాతలు నష్టపోతారన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. టికెట్స్ ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులకు ఏపీ ప్రభుత్వ పెద్దలకు మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. 

అయితే మూడు నెలలుగా ఈ వివాదం నడుస్తున్నా మూవీ  ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ప్రెసిడెంట్ మాట్లాడకపోవడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. మా అధ్యక్షుడు మౌనంగా ఉంటారేంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టికెట్స్ విషయంలో 'మా' స్పందించలేదని విమర్శలు చేస్తున్నవారికి నటుడు నరేష్ వివరణ ఇచ్చారు. టికెట్స్ ధరల సమస్య అసలు 'మా' పరిధిలోకి రాదని, 'మా' ఫిల్మ్ ఛాంబర్ లో ఒక విభాగం మాత్రమే అన్నారు. 'మా' కేవలం సినిమా కార్మికులు, సభ్యుల సంక్షేమం కోసం ఏర్పడిన బాడీ అన్నారు. 

'మా'కు రాజకీయాలతో సంబంధం లేదని, పరిశ్రమలో రాజకీయ పార్టీల ప్రమేయం ఉండరాదని ఆయన అభిప్రాయం వెల్లడించారు. నరేష్ తన పుట్టినరోజు పురస్కరించుకొని మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నటుడిగా యాబై ఏళ్ళు పూర్తి చేసుకున్న నేను చైల్డ్ ఆర్టిస్ట్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా భిన్నమైన పాత్రలు చేశాను. నా సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నాను. దానికి ఈ జెనరేషన్  దర్శకులకు కృతఙ్ఞతలు ఉన్నారు. ఇక తనను నటుడిగా నిలబెట్టిన కృష్ణ, విజయనిర్మల, తన గురువు జంధ్యాల గారికి కృతజ్ఞతలు అన్నారు. 'మా' లో అనేక పదవులు నిర్వర్తించి ట్రెండ్ సెట్ చేశాను. ఇకపై సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు, సిరీస్లు నిర్మిస్తాం అన్నారు.
 

click me!