Priyanka Jawalkar: విజయ్ దేవరకొండ హీరోయిన్ కు కరోనా పాజిటివ్.. సోషల్ మీడియాలో ఏం చెప్పిందంటే..?

Published : Jan 20, 2022, 10:31 AM IST
Priyanka Jawalkar:  విజయ్ దేవరకొండ హీరోయిన్ కు కరోనా పాజిటివ్..  సోషల్ మీడియాలో ఏం చెప్పిందంటే..?

సారాంశం

ఈసారి కరోనా థార్డ్ వేబ్ సెలబ్రిటీలను వదిలి పెట్టడం లేదు. వరుసగా సినిమావాళ్ళు కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గా మరో సినిమా సెలబ్రెటీ కరోనా బారిన పడింది. హీరోయిన్ ప్రియాంక జవల్కార్(Priyanka Jawalkar) తనకు కోవిడ్ పాజిటీవ్ అని ప్రకటించింది.

ఈసారి కరోనా థార్డ్ వేబ్ సెలబ్రిటీలను వదిలి పెట్టడం లేదు. వరుసగా సినిమావాళ్ళు కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గా మరో సినిమా సెలబ్రెటీ కరోనా బారిన పడింది. హీరోయిన్ ప్రియాంక జవల్కార్(Priyanka Jawalkar) తనకు కోవిడ్ పాజిటీవ్ అని ప్రకటించింది.

కరోనా థార్డ్ వేవ్ విజృంబిస్తుంది. ఈ సారి ఎవరిని వదిలిపెట్టేట్టు లేదు కరోనా. గత రెండు వేవ్ లను తప్పించుకున్నవారు.. ఈసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా కాటుకు గురికావల్సి వస్తుంది. ఇందులో రాజకీయ నాయకులు.. సినిమావాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మహా మహా మూవీ స్టార్స్ అందరిని కరోనా వరుస పెట్టి తగులు కుంటుంది. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babau) .. కీర్తి సురేష్( Keerthi Suresh), త్రిష (Trisha), మంచు లక్మీ, తమన్, లతా మంగేష్కర్,ఆ మధ్య కమల్ హాసన్, వడివేలు, ఇలా సినిమా సెలబ్రెటీలు అంతా కరోనా బారిన పడ్డారు.

 అయితే ఇందులో కీర్తిసురేష్, మంచు లక్ష్మీ లాంటివారు రీసెంట్ గా కోలుకుని సోషల్ మీడియాలో తాము కోలుకున్నట్టు వెల్లడించారు. గతంలో కమల్ హాసన్, వడివేలు. హాస్పిటట్ లో ట్రీట్మెంట్ తసుకుని కోలుకున్నారు. ఇక బాలీవుడ్ పాటల దిగ్గజం లతా మంగేష్కర్.. ఐసీయూలో ఉండి కోవిడ్ తో పోరాటు చేస్తున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ లో మరో హీరోయిన్ కరోనా కాటేసింది. యంగ్ హీరోయిన్ ప్రియాంక జవల్కార్(Priyanka Jawalkar) కు కరోనా పాజిటివ్ అని తేలింది.

ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా పేజ్ లో వెల్లడించింది ప్రియాంక. డాక్టర్స్ సలహా మేరకు హోమ్ క్యారంటైన్ లో ఉన్నట్టు తెలిపింది హీరోయిన్. అందరూ కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరింది ప్రీయాంక (Priyanka Jawalkar). కోవిడి వాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని.. మాస్క్ లేకుండా బయటకు రావదంటోంది హీరోయిన్. అంతే కాదు అసలు అత్యవసర పని ఉంటే బయటకు రాకండి.. కరోనాను నెగ్లెట్ చేయోద్దు అంటూ పోస్ట్ పెట్టింది ప్రియాంక జవల్కార్ (Priyanka Jawalkar).  

ఇక ఈ యంగ్ హీరోయిన్ టాక్సీ వాల సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. విజయ్ దేవరకొండ జంటగా టాక్సీవాల సినిమాలో నటించింద. ఈ సినిమా హిట్ అయినా ప్రియాంక కు అనుకున్నంత ఫేమ్ రాలేదు. ఇక రీసెంట్ గా సత్యదేవ్ తో తిమ్మరుసు. కిరణ అబ్బవరం సరసన ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాల్లో నటించింది. ప్రస్తుతం గమణం సినిమాలో నటించిన ఈ హీరోయి ఖాతాలో మరో రెండు ప్రాజెక్ట్ ఉన్నాయి.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు