ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం, సీనియర్ నటులు చలపతి చౌదరి కన్నుమూత, ప్రముఖుల నివాళి

Published : May 20, 2022, 01:57 PM IST
ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం, సీనియర్ నటులు చలపతి చౌదరి కన్నుమూత, ప్రముఖుల నివాళి

సారాంశం

ప్రముఖ సినీ నటుడు చలపతి చౌదరి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో  ఆస్పత్రిలో చేరిన ఆయన.. పరిస్థితి విషమించి.. తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రముఖ సినీ నటుడు కెప్టెన్​ చలపతి చౌదరి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతూ.. రాయచూర్​లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. ఆస్పిటల్ లో చేరినప్పుడు బాగానే ఉన్న ఆయన.. క్రమంగా  పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన తెలుగు,తమిళ,కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. 

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమ మరో సీనియర్ నటుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు కెఫ్టెన్ చలపతి చౌదరి ఈరోజు( మే20) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్ణాటకలోని రాయచూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తెలుగు, తమిళ్,కన్నడ భాషాల్లో ఆయన వందకు పైగా సినిమాల్లో నటించారు. అంతే కాదు ఆయన పలు సీరియల్స్‌లో కూడా నటించారు. రీసెంట్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన  బాలకృష్ణ అఖండ సినిమలో కూడా ఆయన నటించారు.

చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి చలపతికి, దాంతో  నాటకాలే ప్రాణంగా ఉంటూ.. స్టేజ్ షోలు చేస్తూ వచ్చారు చలపతి. ఎన్టీఆర్ నటన చూసి ఆయన సినిమాల్లోకి వచ్చారు. చిన్నప్పుడు స్కూల్‌లో ప్రముఖ నటుడు నూతన్ ప్రసాద్ నాటకలను చూశారు. ఆయన నాటకం వేయకపోతే.. ఆయనకు బదులు చలపతి నాటకాలు చేశారు. ఏఎన్ఆర్ చివరి సినిమా మనంలో కూడా చలపతి చౌదరి నటించారు. చిరంజీవి, శివరాజ్‌ కుమార్‌, బాలకృష్ణ వంటి పలు స్టార్‌ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు చలపతి. అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్‌లోనూ కనిపించారు. తెలుగు భాష అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఎక్కువగా తెలుగు భాషలోనే స్పష్టంగా మాట్లాడేవారు చలపలి చౌదరి.

PREV
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ