NTR 31 : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. దడపుట్టిస్తున్న ఎన్టీఆర్ మాస్ లుక్..

By team teluguFirst Published May 20, 2022, 12:48 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఎన్టీఆర్31’. తారక్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ వణుకుపుట్టిస్తోంది.  
 

‘ఆర్ఆర్ఆర్’ ఘన విజయం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు పెద్ద ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. అందులో ఒకటి దర్శకుడు కొరటాల శితో ‘ఎన్టీఆర్30’, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ 31’. ఈ రెండు చిత్రాల కోసం ప్రస్తుతం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అప్డేట్స్ వచ్చినా సంతోషిస్తున్నారు. తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే ‘ఎన్టీఆర్30’ నుంచి నిన్న మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు ‘ఎన్టీఆర్31’ నుంచి బిగ్ అనౌన్స్ మెంట్ అందింది. 

‘కేజీఎఫ్’ ప్రభంజనంతో ఇండియన్ డైరెక్టర్ సత్తా చూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel). హీరో ఎలివేషన్ ను హైగా చూపించే ఆయన దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుంతోంది. ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ..  మేకర్స్ NTR31 నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.  గ్రే మోడ్ లో ఉన్న పోస్టర్ దడపుట్టిస్తోంది. భారీ మీసాలు, గడ్డంతో ఎన్టీఆర్ గంభీరంగా చూసే చూపు వణుకుపుట్టిస్తోంది. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ డార్క్ ఇంటెన్స్ అవతార్ హై వోల్టెజ్ యాక్షన్ ను సూచిస్తోంది. 
 
ఈ పోస్టర్ ప్రశాంత్ నీల్ ట్వీటర్ లో పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్ పాత్రను వివరించే ప్రయత్నం చేశాడు. ‘రక్తంలో తడిసిన మట్టి మాత్రమే గుర్తుంచుకోవాలి. ఆయన నేల.. ఆయన ప్రస్థానం.. కానీ ఖచ్చితంగా అతని రక్తం కాదు’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ ను వదిలారు. పోస్టర్ కే ఇలాంటి గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్ రాశారంటే.. ఎన్టీఆర్ 31లో తారక్ చెప్పే డైలాగ్స్ కు థియేటర్లు దద్దరిలిపోతాయని ఇట్టే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2023లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

 

𝑻𝒉𝒆 𝒐𝒏𝒍𝒚 𝒔𝒐𝒊𝒍 𝒕𝒉𝒂𝒕 𝒊𝒔 𝒘𝒐𝒓𝒕𝒉 𝒓𝒆𝒎𝒆𝒎𝒃𝒆𝒓𝒊𝒏𝒈 𝒊𝒔 𝒕𝒉𝒆 𝒐𝒏𝒆 𝒔𝒐𝒂𝒌𝒆𝒅 𝒊𝒏 𝒃𝒍𝒐𝒐𝒅!

𝐇𝐢𝐬 𝐬𝐨𝐢𝐥.... 𝐇𝐢𝐬 𝐫𝐞𝐢𝐠𝐧 .....
𝐁𝐮𝐭 𝐝𝐞𝐟𝐢𝐧𝐢𝐭𝐞𝐥𝐲 𝐧𝐨𝐭 𝐡𝐢𝐬 𝐛𝐥𝐨𝐨𝐝.... pic.twitter.com/NNSw3O9zU6

— Prashanth Neel (@prashanth_neel)
click me!