బాలయ్య కోసం కసరత్తు మొదలెట్టిన బోయాపాటి, అఖండ సీక్వెల్ ఎప్పుడంటే....?

By Mahesh Jujjuri  |  First Published May 20, 2022, 1:20 PM IST

బాలయ్య కోసం మరోసారి కసరత్తులు మొదలెట్టాడట బోయపాటి. అయితే ఈసారి తన టీమ్ ను ఫుల్ ప్లజ్డ్ గా రంగంలోకి దింపాడ. ఇదంతా దేనికోసం అంటే... అఖండా సీక్వెల్ కోసం అంటా. 


బాలయ్య అఖండ సినిమా అఖండ విజయంతో.. మంచి జోష్ మీద ఉన్నాడు. తనతో హ్యాట్రిక్ హిట్ సినమాలు చేసిన బోయపాటికి మరో అవకాశం ఇచ్చాడట బాలయ్య. అది కూడా భారీ సక్సెస్ ఇచ్చిన అఖండ సినిమాను సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారట వీరిద్దరు. ఇక దీనికి సంబంధించి ఓ అప్ డేటన్ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తోంది. 

బాలకృష్ణ  హీరోగా  బోయపాటి తెరకెక్కించిన అఖండ సంచలన విజయంతో.. టీమ్ లో కొత్త జోష్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ వసూళ్లలోను కొత్త రికార్డులను నమోదు చేసిందిసినిమా. బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది మూవీ. పెద్దవాళ్ళతో పాటు పిల్లలను కూడా అఖండా  అదే స్థాయిలో ఆకట్టుకుంది.

Latest Videos

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ ఉందన్నట్టుగా బోయపాటి గతంలోనే  హింట్ ఇచ్చాడు. ఆ తరువాత ఈ సినిమాకి సంబంధించిన వేదికలపై ఆయన మాట్లాడుతూ కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఉందనే క్లారిటీ ఇచ్చాడు. అయితే అందుకు సమయం ఉందని చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కథపైనే బోయపాటి రైటింగ్ డిపార్టుమెంట్ వర్క్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది,  

ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలో మెప్పించాడుర అఘొరాగా బాలయ్య విశ్వరూపానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే ఈమూవీలో అఘోరాతో ప్రత్యేక అనుబంధం  ఏర్పరుచుకున్న పాప చుట్టు సెకండ్ పార్ట్ సినిమా ఉంటుందట, ముఖ్యంగా ఈపాల టీనేజ్ లోకి అడుగుపెట్టడం .. ఆమెకి ఇచ్చిన మాట కోసం అఖండ మళ్లీ రావడంతో సీక్వెల్ కథ మొదలవుతుందని అంటున్నారు. 

అయితే వరుస సినిమాలతో బాలయ్య బిజిగా ఉన్నారు. బోయపాటి చేతిలోకూడా రెండుసినిమాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని .. అనిల్ రావిపూడి సినిమాలను బాలయ్య పూర్తి చేసిన తరువాత, ఆయనను తీసుకుని బోయపాటి సెట్స్ పైకి వెళతాడని చెబుతున్నారు. ఈలోపు బోయపాటి తన సినిమాలు కూడా కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నాడట. 

click me!