బ్రహ్మానందం ఇంటిలో పండగ వాతావరణం... మళ్ళీ తాత అయిన లెజెండరీ కమెడియన్!

Published : Nov 27, 2022, 10:14 PM IST
బ్రహ్మానందం ఇంటిలో పండగ వాతావరణం... మళ్ళీ తాత అయిన లెజెండరీ కమెడియన్!

సారాంశం

నటుడు బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. కొడుకు గౌతమ్ భార్య పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గౌతమ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.   

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇంటిలో  పండగ చోటు చేసుకుంది. ఆయన మరోసారి తాత అయ్యారు. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ భార్య జ్యోత్స్న నేడు పండండి అమ్మాయికి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని గౌతమ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అమ్మాయి పుట్టడంతో ఆనందం రెట్టింపు అయ్యిందని గౌతమ్ ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేశారు. అలాగే తన కొడుకు అప్పుడే పుట్టిన చెల్లిని చూస్తున్న ఫోటో షేర్ చేశారు. 

గౌతమ్-జ్యోత్స్నలకు మొదటి సంతానంగా కొడుకు పార్థ పుట్టాడు. తాజాగా ఈ దంపతులు కూతురిని తమ జీవితాల్లోకి ఆహ్వానించారు. బ్రహ్మానందం కి ఇప్పుడు మనవడితో పాటు మనవరాలితో ఆడుకునే అవకాశం లభించింది. బ్రహ్మానందంకి ఇద్దరు కుమారులు కాగా గౌతమ్ హీరోగా పరిశ్రమలో అడుగుపెట్టారు. 2004లో విడుదలైన పల్లకిలో పెళ్లికూతురు మూవీతో లాంఛ్ అయ్యాడు. ఆ మూవీ పర్లేదు అనిపించింది. గౌతమ్ కి మాత్రం అవకాశాలు రాలేదు. చాలా గ్యాప్ తర్వాత 2018లో మను టైటిల్ తో మరో మూవీ చేశారు. 

మరోవైపు బ్రహ్మానందం సినిమాలు తగ్గించారు. ఆయన చాలా సెలెక్టివ్ గా చిత్రాలు చేస్తున్నారు. గత ఏడాది జాతి రత్నాలు చిత్రంలో బ్రహ్మానందం జడ్జి రోల్ చేశారు. కాగా ఆయన కీలక రోల్ చేసిన పంచతంత్రం... డిసెంబర్ 9న విడుదల కానుంది. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ చిత్రంలో బ్రహ్మానందం ఒక ప్రాధాన్యత ఉన్న పాత్ర చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌