బాలయ్య-అనిల్‌రావిపూడి సినిమా ముహూర్తం ఫిక్స్.. స్టార్ట్ అయ్యేది అప్పుడే?

Published : Nov 27, 2022, 06:44 PM IST
బాలయ్య-అనిల్‌రావిపూడి సినిమా ముహూర్తం ఫిక్స్.. స్టార్ట్ అయ్యేది అప్పుడే?

సారాంశం

తన నెక్ట్స్ సినిమాకి ప్లాన్‌ చేస్తున్నారు బాలయ్య. కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య సినిమా చేయబోతున్నారు. ఈ చిత్ర ముహూర్తం ఫిక్స్ అయ్యిందట.

`అఖండ` సక్సెస్‌ ఇచ్చిన జోష్‌లో దూకుడు మీదున్నాడు బాలకృష్ణ(Balakrishna). మరోవైపు `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` సీజన్‌ 2తోనూ దుమ్మురేపుతున్నారు. ఈ షో ఇండియాలోనే నెంబర్‌ 1 టాక్‌ షోగా నిలవడం విశేషం. ఈ రెండు ఆనందాలతో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో తన సినిమాల షూటింగ్‌లో పాల్గొంటున్నాడు బాలకృష్ణ. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఇప్పుడు ఆయన `వీర సింహారెడ్డి` (Veera SimhaReddy) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. చిత్రీకరణ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్‌ చేయబోతున్నారు. 

ఇదిలా ఉంటే ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాకి ప్లాన్‌ చేస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య సినిమా చేయబోతున్నారు. `NBK108` వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటి వరకు ఎంటర్‌టైనింగ్‌ చిత్రాలను రూపొందించిన అనిల్‌ రావిపూడి ఈ సినిమాతో తనలోని మాస్‌ యాంగిల్‌ని చూపించబోతున్నారట. ఒక మాస్‌ మసాలా కథని బాలయ్య కోసం రెడీ చేశాడట. అయితే సెకండాఫ్‌ విసయంలో సంతృప్తిగా లేని బాలయ్య కొన్ని మార్పులు సూచించడంతో ఆ పనిలో అనిల్‌ రావిపూడి ఉన్నారట. 

అయితే ఇప్పుడీ సినిమాని ప్రారంభించబోతున్నారు. ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. స్క్రిప్ట్ ఆల్మోస్ట్ రెడీ కావడంతో షూటింగ్‌ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. అయితే లేటెస్ట్ ఇన్‌ఫర్మేషన్‌ ప్రకారం ఈ సినిమా ముహూర్తం డేట్‌ని కూడా ఖరారు చేశారట. డిసెంబర్‌ 9న సినిమాని గ్రాండ్‌గా లాంచ్‌ స్టార్ట్ చేయాలని ప్లాన్‌ చేశారట. ఇందులో బాలయ్య సరికొత్త గెటప్‌లో కనిపిస్తారని, మాస్‌, యాక్షన్‌తోపాటు అనిల్‌ రావిపూడి మార్క్ కామెడీని మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని ఫిల్మ్ నగర్‌ టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే ఈసినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కబోతుంది. ఇందులో శ్రీలీలా బాలకృష్ణకి కూతురుగా కనిపించబోతుండటం విశేషం. హీరోయిన్‌ ఎవరనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌