
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) వరుస చిత్రాలతో దూసుకువెళ్తున్నారు. విజయ్ కు తెలుగు ఆడియెన్స్ లో ‘త్రి ఇడియెట్స్’ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత అంతటి క్రేజ్ ను మళ్లీ గతేడాది రిలీజ్ అయిన ‘మాస్టర్’చిత్రంతోనే పొందగలిగాడు. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. యూత్ ను బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. మరోవైపు సోషల్ మేసేజ్ ను కూడా ఇవ్వడం ఆడియెన్స్ కు తెగ నచ్చింది.
Master చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) లోకనాయకుడు కమల్ హాసన్ తో కలిసి ‘విక్రమ్’ చిత్రాన్ని తెరకెక్కుతున్నారు. రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య లాంటి స్టార్స్ ఈ మూవీలో నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం Vikram చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలో ఉన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ దళపతి 67వ చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘దళపతి67వ చిత్రం కచ్చితంగా భారీగా రూపుదిద్దుకుంటుంది. విజయ్ అన్నతో తీసిన ‘మాస్టర్’ మూవీ కేవలం ట్రయల్ రన్ మాత్రమే. ఆ సినిమా అప్పుడు సరిపడే అంతా సమయం దొరకలేదు. కేవలం ఆరునెలలో టైం లభించింది. అయినా అవకాశాన్ని కోల్పోకూడదని ‘మాస్టర్’ మూవీని డైరెక్ట్ చేశాం. కానీ నెక్ట్స్ వచ్చే ఫిల్మ్ మాత్రం పక్కాగా వందశాతం ప్రయోగాత్మకంగా ఉంటుంది. మాస్టర్ ను మించిన సబ్జెక్ట్ తో బెస్ట్ అవుట్ పుట్ ను అందిస్తాం.’ అని వివరించారు. దీంతో విజయ్ ఫాన్స్ ఖుషీ అవుతున్నారు.