Singer Clarity : చిన్న విషయానికి.. శిష్యుడిని చెప్పుతో కొట్టిన సింగర్.. దెబ్బకు దిగొచ్చిన గురువు!

ప్రముఖ సింగర్ Singer తన శిష్యుడిని చెప్పుతో కొట్టిన ఘటన నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది. వీడియో వైరల్ గా మారడంతో చివరిగా వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఆయన ఏమన్నారంటే.. 


ఓనమాలు నేర్పిన గురువే శిష్యుడిని చెప్పుతో కొట్టడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. చేసింది ఏమాత్రం తప్పు అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రముఖ సింగర్ చివరికి వివరణ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ అలా చేసింది ఎవరో కాదు.. పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ సింగర్ రాహత్ ఫతే అలీ ఖాన్ (Rahat Fateh Ali Khan). తన గాత్రంతో ఆడియెన్స్ ను ఎంతో ఆకట్టుకున్నారు. మంచి పేరు సంపాదించుకున్నారు. 

అలాంటి సింగర్ తన శిష్యుడిని చెప్పుతో కొట్టడం ఆశ్చర్యకరంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో తను చేసింది తప్పు అని భావించి దిగి వచ్చారు. బాధితుడికి క్షమాపణలు కూడా చెప్పారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. జరిగిన దానిపై వివరణ ఇచ్చారు.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే... 

Latest Videos

వీడియోలో మాట్లాడుతూ... ‘ఇది గురు, శిష్యుల మధ్య జరిగిన ఘటన. బాధితుడు నా సొంత శిష్యుడే. నాకు కొడుకులాంటి వాడుకూడానూ. శిష్యుడు తప్పు చేస్తే గురువు దండించినట్టుగానే దీన్ని భావించాలని కోరుతున్నాను. అతను మంచి చేస్తే ప్రేమ కురిపించేది కూడా గురువేనని గుర్తుంచుకోవాలి. తప్పు చేస్తే మాత్రం శిక్ష తప్పదు. ఏదేమైనప్పటికీ నా శిష్యుడికి నేను క్షమాపణలు చెబుతున్నాను’... అని పేర్కొన్నారు. 

అయితే ఈ వీడియోలో... బాధిత శిష్యుడు కూడా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.. అతను మాట్లాడుతూ... పవిత్ర జలానికి సంబంధించిన ఓ బాటిల్ కనిపించకుండా పోయింది. దానికి కారణం తనేని చెప్పారు. అందుకే తన గురువు శిక్షించారని తెలిపాడు. అంతకుమించి ఎలాంటి దురుద్దేశం ఆయనకు లేదని భావిస్తున్నట్టు చెప్పాడు. ఆయన తనకు తండ్రిలాంటి వాడని కూడా చెప్పారు. అందరినీ ఎంతగానో ప్రేమిస్తారన్నారు. ఎవరో కావాలని వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్నారు. మొత్తానికి ఆ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో గురువు దిగొచ్చి మరీ సారీ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

click me!