యాక్షన్ కింగ్ అర్జున్ కు మాతృ వియోగం, అనారోగ్యంతో లక్ష్మీదేవమ్మ మరణం

Published : Jul 23, 2022, 01:26 PM IST
యాక్షన్ కింగ్ అర్జున్ కు మాతృ వియోగం, అనారోగ్యంతో లక్ష్మీదేవమ్మ మరణం

సారాంశం

ప్రముఖ తమిళ స్టార్ హీరో. యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అర్జున్ మాతృమూర్తి  లక్ష్మీ దేవమ్మ అనారోగ్యంతో బాధపడుతూ  ప్రైవేట్ హస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ స్టార్ హీరో అర్జున్  ఇంట విషాదం చోటు చేసుకుంది.అర్జున్ మాతృమూర్తి  లక్ష్మీ దేవమ్మ అనారోగ్యంతో బాదపడుతూ పరమపాదించారు.85 సంవత్సరాల వయస్సులో.. అనారోగ్య కారణాల వల్ల ఆమె తుదిశ్వాస విడిచారు.లక్ష్మీదేవమ్మ మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.  ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె  ఉన్నారు.

లక్ష్మీదేవమ్మ కుమార్తె కుమారులు కూడా కన్నడ ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్నారు. చిరంజీవి సర్జా, దృవ్ సర్జాలు కన్నడ హీరోలుగా ఉన్నారు . చిరంజీవి సర్జా రెండేళ్ళ క్రితం చాలా చిన్న వయస్సులో గుండెపోటుతో మరణించారు. చాలా కాలంగా ఆమె తన కూతురు దగ్గర బెంగళూరులోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్ లో ఉంది. ఇక  పప్రస్తుతం లక్షీ దేవమ్మ మరణ వార్త తెలియడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు అర్జున్ ఓదారుస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

పెళ్లి తర్వాత రష్మిక మందన్న ఫుల్ బిజీ.. లైన్‌లో 6 సినిమాలు, విజయ్ దేవరకొండ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్..
Theatre Movies: ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు.. శ్రీవిష్ణు మళ్లీ వస్తున్నాడు, వరలక్ష్మి ప్రయోగం