
పుష్ప(Pushpa) చిత్రాన్ని రీజినల్ ఫిలిం గా స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే నాటికి దర్శకుడు సుకుమార్ తో పాటు అల్లు అర్జున్(Allu Arjun) కి ఏమాత్రం పాన్ ఇండియా ఆలోచన లేదు. సడన్ గా పుష్ప పాన్ ఇండియా మూవీ అంటూ ప్రకటన చేశారు. అలాగే రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. తీరా విడుదల తర్వాత కూడా పుష్ప హిందీలో సక్సెస్ అవుతుందనే నమ్మకం ఎవరికీ లేదు. ముంబైలో పుష్ప ప్రమోషన్స్ ఏదో మొక్కుబడిగా నిర్వహించారు. ఇక మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న పుష్ప హిందీ వెర్షన్ కి మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్ కేవలం మూడు కోట్లు.
అయితే వర్డ్ ఆఫ్ మౌత్ వర్క్ అవుట్ కాగా మెల్లగా పుంజుకుంది. అనూహ్యంగా భారీ చిత్రాలకు షాక్ ఇస్తూ నెల రోజులకు పైగా థియేటర్స్ లో పుష్ప రన్ కొనసాగింది. వంద కోట్ల మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇక అన్ని భాషల్లో వరల్డ్ వైడ్ పుష్ప రూ. 360 కోట్ల గ్రాస్ రాబట్టింది. పుష్ప పార్ట్ 1 ఇంత పెద్ద విజయం సాధించగా పార్ట్ 2 పుష్ప ది రూల్ మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ ఏకంగా రూ. 350 కోట్లకు పెంచేశారు.
ఇక రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 2023 ఆగస్టు లో పుష్ప విడుదల కానుందట. ఈ మూవీకి సంబంధించిన మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే ఈసారి ఏకంగా పది భాషల్లో ప్లాన్ చేస్తున్నారట. రీజినల్, ఇంటెర్నేషనల్ భాషల్లో కలిపి పది భాషల్లో పుష్ప చిత్రాన్ని విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్ గా తెలుస్తుంది. పది భాషల్లో విడుదల అంటే ఇక ఈ స్థాయిలో తెరకెక్కిస్తారో చూడాలి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా రష్మిక మందాన(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. పుష్ప పార్ట్ 2 లో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్లు సమాచారం ఉంది. ఇక పుష్ప పార్ట్ 1 లో నటించిన సునీల్, అనసూయ కూడా కంటిన్యూ కానున్నారు. పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.