శ్రావణ భార్గవి‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు.. తిరుపతిలో అడుగుపెట్టనివ్వమని వార్నింగ్..!

Published : Jul 23, 2022, 01:07 PM IST
శ్రావణ భార్గవి‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు.. తిరుపతిలో అడుగుపెట్టనివ్వమని వార్నింగ్..!

సారాంశం

ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి అన్నమయ్య పాట వీడియోపై వివాదం మరింతగా ముదురుతోంది. శ్రావణ భార్గవిపై తిరుపతి  ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో తిరుపతికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. 

ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి అన్నమయ్య పాట వీడియోపై వివాదం మరింతగా ముదురుతోంది. శ్రావణ భార్గవిపై తిరుపతి  ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో తిరుపతికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసినందు ఆమెపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, అన్నమయ్య వారసులకు శ్రావణ భార్గవి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రావణ భార్గవి వెంటనే ఆ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించాలన్నారు.

ఆ వీడియోను తొలగించకుంటే శ్రావణి భార్గవి తిరుపతిలో అడుగు పెట్టనివ్వబోమని, శ్రీవారి దర్శనం చేసుకోకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అన్నమయ్య కీర్తనలను ఎవరూ తప్పుగా చిత్రీకరించకుండా టీటీడీ చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై టీటీడీ ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. అన్నమయ్య కీర్తనలు ఇకపై ఎవరు తప్పుగా చిత్రీకరించకుండా ఓ చట్టాన్ని తీసుకురావాలని టీటీడీని కోరారు. 

అసలేం జరిగిందంటే.. శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసిన తాజా మ్యూజికల్ వీడియో వివాదంలో పడింది. అన్నమయ్య కీర్తనల్లో ఒకటైన `ఒకపరి ఒకపరి వయ్యారమే` అంటూ సాగే కీర్తనలతో  శ్రావణ భార్గవి దీనిని రూపొందించింది. ఇందులో తనే యాక్ట్ చేసింది. ఈ పాటకు యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తుంది. అయితే శ్రావణ భార్గవి మ్యూజికల్ వీడియోను.. అన్నమయ్య ట్రస్ట్ సభ్యులు, అన్నమయ్య వారసులు తప్పుబట్టారు. అన్నమయ్య కీర్తనలను అపహాస్యం చేసేలా, కించపరిచేలా ఉన్నాయని అన్నమయ్య ట్రస్ట్ సభ్యులు ఆరోపిస్తున్నారు. అన్నమయ్య కీర్తనలను శ్రావణ భార్గవి శృంగార కీర్తనలుగా మార్చిందని, వెంటనే వాటిని ఆ పాటని తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Also Read: బొట్టేది, తాళేది? పెళ్లైన అమ్మాయి ఇలా ఉంటుందా? శ్రావణ భార్గవిపై విరుచుకుపడ్డ కరాటే కళ్యాణి

ఈ క్రమంలోనే అన్నమయ్య ట్రస్ట్‌ సభ్యునికి, శ్రావణ భార్గవికి మధ్య జరిగినట్టుగా చెబుతున్న ఆడియో క్లిప్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పలువరు శ్రావణ భార్గవి వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది శ్రావణ భార్గవిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఈ క్రమంలోనే వివాదంపై శ్రావణ భార్గవి స్పందిస్తూ.. మహిళా గాయకులు పాటను విడుదల చేసినప్పుడే ప్రజలకు అభ్యంతరాలు ఉంటాయని అన్నారు. ‘‘ఈ వీడియోలో అశ్లీలత లేదు. అన్నమయ్య పాటను కించపరిచేలా లేదు. కేవలం మహిళా గాయకులు వీడియో, ఆడియో ఆల్బమ్‌లు విడుదల చేస్తే కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసి వివాదాలు సృష్టిస్తారని.. అయితే మగ గాయకులు విడుదల చేసిన ఆల్బమ్‌లను పట్టించుకోరు’’ అని శ్రావణ భార్గవి పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?