Double Ismart : గ్రాండ్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ లాంచ్.. బిగ్ షాక్ ఇవ్వబోతున్న పూరీ? అదేంటంటే.!

By Asianet News  |  First Published Jul 10, 2023, 6:23 PM IST

బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం చిత్రాన్ని పూజాకార్యక్రమాలతో గ్రాండ్ లాంచ్ చేశారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కూడాప్రారంభం కానుంది. లాంచింగ్ తో పాటు విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. 
 


ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) - స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో 2019లో ‘ఇస్మార్ట్ శంకర్’ శంకర్ విడుదలైన విషయం తెలిసిందే. అటు ఫ్లాప్స్ తో ఉన్న పూరీకి, ఇటు మాస్ హిట్ అందుకోవాలన్న రామ్ పోతినేనికి ఈ సినిమా మంచి రిజల్ట్ ను అందించింది. అలాగే ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యింది. కలెక్షన్ల పరంగా ఇంకా మంచి ఫలితానిచ్చింది.

Ismart Shankar అందించిన ఫలితంతో పూరీ జగన్నాథ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారని ఫ్యాన్స్  ఖుషీ అయ్యారు. అయితే ఈ సినిమా తర్వాత ‘లైగర్’ తో కాస్తా అప్సెట్ చేశారు. పైగా కాస్తా ఫినాన్షియల్ గానూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటన్నింటికి చెక్ పెట్టేందుకు మళ్లీ ‘డబుల్ ఇస్మార్ట్’ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా పూజాకార్యక్రమాలతో మూవీ ప్రారంభమైంది.

Latest Videos

Double Ismart  టైటిల్ తో ఈ చిత్రం ప్రారంభమైంది. చిత్ర ప్రారంభోత్సవానికి పూరీ జగన్నాథ్, ఛార్మీ, రామ్ పోతినేని, దర్శకుడు బాబీ కూడా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని  వచ్చే ఏడాది మార్చి8న విడుదల చేయబోతున్నట్టు ముందుగానే అనౌన్స్ చేశారు. కేవలం ఆరునెలల్లోనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుండటం విశేషం. అయితే తక్కువ సమయంలో సినిమాలు తీసి హిట్ కొట్టడం పూరీ జగన్నాథ్ ప్రత్యేకత అనే విషయం తెలిసిందే. 

అయితే,  ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంతో పూరీ జగన్నాథ్ భారీ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రం అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఓ ఆసక్తికరమైన విషయాన్ని యూనిట్ వదలడమే. అదేంటే ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ రాబోతుందని టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. కానీ పోస్టర్ లో ఎడమవైపు మాత్రం వర్కింగ్ టైటిట్ అని ఇచ్చారు. దీంతో మళ్లీ టైటిల్ మార్చబోతున్నారా? అలాగైతే కథ కూడా మారిపోతుంది కదా? అని అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ మేరకు న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది. ఇందులో వాస్తవం ఎంతున్నదనేది చూడాలి. 

ఇక ‘డబుల్ ఇస్మార్ట్’లో హీరోయిన్లు ఎవరు, ఇతర టెక్నీషియన్లకు సంబంధించిన డిటేయిల్స్  మున్ముందు వెల్లడించనున్నారు. రామ్ పోతినేని నెక్ట్స్  బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ‘స్కంద’ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. 

🎬 takes off on a grand note, marked by a formal Pooja ceremony💫

Here's a striking glance from the Launch💥

- https://t.co/u46SJW6Kb2

In Cinemas MARCH 8th, 2024❤️‍🔥

Ustaad pic.twitter.com/fnVenBexQq

— Puri Connects (@PuriConnects)
click me!