విజయ నిర్మల సంతాప సభలో కూలిన టెంట్!

Published : Jul 06, 2019, 12:11 PM IST
విజయ నిర్మల సంతాప సభలో కూలిన టెంట్!

సారాంశం

నటి, దర్శకురాలు విజయ్ నిర్మల సంతాప సభలో ప్రమాదం త్రుటిలో తప్పింది.

నటి, దర్శకురాలు విజయ్ నిర్మల సంతాప సభలో ప్రమాదం త్రుటిలో తప్పింది. విజయ్ నిర్మల మరణించి పది రోజులు కావడంతో ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని సంధ్య కన్వెషనల్ సెంటర్ లో ఆమె కుటుంబసభ్యులు సంతాప సభ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీప్రముఖులు, అభిమానులు హాజరవుతారని భావించిన  కుటుంబసభ్యులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే సంధ్యా కన్వెషనల్ సెంటర్ లో అతిథుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది.

అయితే అతిథులు అక్కడకి చేరుకోవడానికి ముందే టెంట్ కూలిపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది