రివర్స్ లో 'సాహో' స్ట్రాటజీ, కంగారుపడుతున్న ఫ్యాన్స్!

By AN TeluguFirst Published Jul 6, 2019, 11:51 AM IST
Highlights

ప్రభాస్‌ నటిస్తోన్న 'సాహో' చిత్రం ఫస్ట్ సాంగ్ ని  ఈనెల 8న విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

 

ప్రభాస్‌ నటిస్తోన్న 'సాహో' చిత్రం ఫస్ట్ సాంగ్ ని  ఈనెల 8న విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. 'సైకొ సైయాన్‌..' అనే పల్లవితో ప్రారంభమయ్యే ఈ పూర్తి లిరికల్‌ విడియోను రిలీజ్‌ చేస్తామని   తెలియజేసింది. ఈ సాంగ్ టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి సినీ లవర్స్ ను,అభిమానులను  పూర్తిగా నిరాశపరిచింది.   శ్రద్దాకపూర్ ని హైలెట్ చేస్తూ ప్రభాస్ ని పెద్దగా చూపలేదు. సర్లే పూర్తి సాంగ్ కాదు కదా అని సరిపెట్టుకున్నా... ఆ పాట హిందీలో షూట్ చేసి, తెలుగులోకి డబ్ చేసారని తెలిసిపోతోంది. దాన్ని బట్టి నిర్మాతలు పూర్తిగా బాలీవుడ్ నే టార్గెట్ చేస్తున్నారని స్పష్టమవుతోంది. 

బాహుబలి చిత్రాన్ని మొదట తెలుగు ప్రేక్షకులకు తగినట్లుగా రెడీ చేసి ఆ తర్వాత హిందీలోకి , ఇతర భాషల్లోకి డబ్ చేసారు. ఇప్పడది రివర్స్ లో జరుగుతున్నట్లు అనిపిస్తోంది.   ఈ సినిమాని యువి క్రియేషన్స్‌ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జిబ్రాన్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ప్రత్యేకంగా నిలవనుందని పేర్కొంటున్నారు.

ప్రతి సీన్‌నీ ఎలివేట్‌ చేసే విధంగా ప్రపంచ స్థాయి నాణ్యతతో రీ-రికార్డింగ్‌ అందించనున్నారు జిబ్రాన్‌ అని చెబుతున్నారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్‌తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ప్రభాస్‌, శ్రద్ధాకపూర్‌, జాకీష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్‌ విజరు, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్రకాష్‌ బెల్వాది, ఎవిలిన్‌ శర్మ, చంకీ పాండే, మందిరా బేడీ, మహేష్‌ మంజ్రేఖర్‌, టిను ఆనంద్‌, శరత్‌ లోహితష్వా తదితరులు నటిస్తున్నారు.

click me!