రిలేషన్షిప్ ఉంది.. పెళ్లి ఆలోచన లేదు.. ఎఫైర్ పై కుర్ర హీరో కామెంట్స్!

Published : Jul 06, 2019, 11:38 AM IST
రిలేషన్షిప్ ఉంది.. పెళ్లి ఆలోచన లేదు.. ఎఫైర్ పై కుర్ర హీరో కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా చాలా కాలంగా నటుడు అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగిస్తోంది. 

బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా చాలా కాలంగా నటుడు అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగిస్తోంది. అయితే ఈ విషయంపై మాత్రం ఈ జంట పెద్దగా స్పందించదు. అర్జున్ తో ఎఫైర్ కారణంగానే మలైకా.. అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకుందని బాలీవుడ్ మీడియాఅప్పట్లో కథనాలు ప్రచురించింది.

విడాకుల తరువాత మలైకా పబ్లిక్ గానే అర్జున్ కపూర్ తో తిరగడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్లడం, పార్టీలకు వెళ్లడం వంటివి చేస్తున్నారు. రీసెంట్ గా మలైకా సోషల్ మీడియాలో వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేసింది.

దీంతో వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించాడు అర్జున్ కపూర్. తను రిలేషన్షిప్ లో ఉన్న మాట నిజమేనని కానీ పెళ్లి ఆలోచన లేదని చెప్పుకొచ్చాడు.

మలైకాతో జంటగా ఉండడాన్ని ఎంజాయ్ చేస్తానని.. ఇద్దరికీ ఆ కంఫర్ట్ జోన్ ఉందని చెప్పాడు. కానీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మాత్రం లేదని.. కొన్ని సార్లు రిలేషన్షిప్ లో ఉండడం ఎంతో బాగుంటుందని.. తన చుట్టూ ఉన్న జనాలు ఏం అనుకుంటారో అనే బాధ తనకు లేదని చెప్పాడు. 

PREV
click me!

Recommended Stories

బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్