ఆటకు సై అంటున్న శ్రద్ధా దాస్

Published : Nov 22, 2016, 02:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
ఆటకు సై అంటున్న శ్రద్ధా దాస్

సారాంశం

త్వరలో శ్రద్ధా దాస్ ఆట హారర్ ఎంటర్ టైనర్ మూవీలో శ్రద్ధ లీడ్ రోల్ కీలక పాత్రలో షాయాజీ షిండే  

గ్లామరస్ గర్ల్ శ్రద్ధదాస్ ముఖ్యపాత్రలో రూపొందిన రియలిస్టిక్ హారర్ థ్రిల్లర్ "ఆట". "గేమ్ నెవర్ ఎండ్స్" అనేది ఉపశీర్షిక. మాధురి ఇటాగీ, గాయత్రి, అవినాష్, రాజారవీంద్రలు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ జి.ఆర్ దర్శకత్వం వహించారు. వేగా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై విక్రమ్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.సుబ్రమణ్యం (బాబీ) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.  

 

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి.సుబ్రమణ్యం (బాబీ) మాట్లాడుతూ.. "హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రెగ్యులర్ హారర్ సినిమాల్లా కాకుండా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. శ్రద్ధాదాస్, మాధురి ఇటాజీ, గాయత్రిల గ్లామర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గ్లామర్ తోపాటు హారర్ ను సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందన్న పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలోని హారర్ ఎలిమెంట్స్ ను హ్యాండిల్ చేసిన విధానం, క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్ ఈ చిత్రాన్ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాను" అన్నారు. 

 

షాయాజీ షిండే, కాదంబరి జెత్వానీలు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వి.రవికుమార్, సంగీతం: హరి నికేష్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.సుబ్రమణ్యం, నిర్మాత: విక్రమ్ రాజు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజ్ కుమార్ జి.ఆర్!

 

 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 24: విశ్వక్‌ను చితక్కొట్టిన ధీరజ్, కోపంతో భర్తను కొట్టిన ప్రేమ
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ అరెస్ట్ విషయంలో జ్యోపై అనుమానం- కార్తీక్ నిజం కనిపెడతాడా?