తిరిగి షూటింగ్ లకు వరుణ్ తేజ్

Published : Nov 22, 2016, 02:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
తిరిగి షూటింగ్ లకు వరుణ్ తేజ్

సారాంశం

తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్న వరుణ్ తేజ్ మిస్టర్ మూవీ షూటింగ్ సందర్భంగా వరుణ్ కాలికి గాయం గత 50 రోజులుగా రెస్ట్ తీసుకుని తిరిగొచ్చిన వరుణ్ తేజ్

కాలికి గాయమై దాదాపు రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన మెగా హీరో వరుణ్ తేజ్ తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మిస్టర్ సినిమా షూటింగ్  జరుగుతుండగా ప్రమాదానికి గురైన వరుణ్, కాలికి తీవ్ర గాయం కావటంతో గత కొన్ని రోజులుగా షూటింగ్ లకు దూరమయ్యాడు.

 

వరుణ్ కాలికి గాయం కావటంతో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ తో పాటు, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రారంభించిన ఫిదా సినిమాలు కూడా ఆగిపోయాయి. అయితే దాదాపు 50 రోజుల విరామం తరువాత సోమవారం వరుణ్ తిరిగి షూటింగ్ లో పాల్గొన్నాడు.

కాలి గాయం నుంచి కాస్త ఉపశమనం కలగటంతో మిస్టర్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించాడు. ప్రస్తుతానికి ఫిదా సినిమా పూర్తిగా పక్కన పెట్టేసి మిస్టర్ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు వరుణ్. ఇప్పటికే సినిమా ఆలస్యం కావటంతో మిస్టర్ సినిమా పూర్తి చేసిన తరువాతే ఫిదాకు డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు.

 

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న మిస్టర్ మూవీని నల్లమలపు బుజ్జి నిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. కొద్ది రోజులుగా వరుస ఫ్లాప్ లతో ఇబ్బందులో ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల ఈ సినిమా తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. మొత్తంమీద వరుణ్ షూటింగ్ లకు వస్తుండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Mysaa Glimpse Review: అడవిలో గర్జించిన రష్మిక మందన్న.. `మైసా` మూవీ ఫస్ట్ గ్లింప్స్ జస్ట్ గూస్‌ బమ్స్
కాంతార 1 రికార్డుకు గండి కొట్టిన ధూరందర్.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ?