
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ దంపతులకు స్వైన్స ఫ్లూ సోకినట్లు సీనియర్ జర్నలిస్ట్ అనుపమ చోప్రా ట్వీట్ చేశారు. అందువల్లనే సత్యమేవజయతే వాటర్ కప్ చాలెంజ్ కు రాలేదని అన్నారు. ఇటీవలే సీక్రెట్ సూపర్ స్టార్ ట్రైలర్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయం అమిర్ ఖాన్ కూడా ధృవీకరించారు.
అయితే దంగల్ నటి జైరా వాసిమ్ ఫీమేల్ లీజ్ నటిస్తున్ సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రం నూతన దర్శకుడు అద్వైత్ చౌహన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని ఆమిర్ సతీమణి కిరణ్ రావు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నారు.
ఇక ఆమిర్ ఖాన్ త్వరలో అమితాబ్ బచ్చన్ తో కలిసి యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంలో నటించనున్నారు.