ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో మెరవనున్న రానా

Published : Aug 06, 2017, 03:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో మెరవనున్న రానా

సారాంశం

బిగ్ బాస్ కు నేనే రాజు నేనే మంత్రి రానా దగ్గుబాటి ఇప్పటికే జెమినీ టీవీలో రానా నెంబర్ వన్ యారి షో ఇప్పుడు స్టార్ మా బిగ్ బాస్ లో గెస్ట్ గా సర్ ప్రైజ్ ఇవ్వనున్న రానా

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా స్టార్ మాలో వస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోపై రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. శని ఆదివారాల్లో ఎన్.టి.ఆర్ వచ్చే ఎపిసోడ్స్ ఆడియెన్స్ ను మరింతగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మరింత ఎట్రాక్ట్ చేసేలా.. కొత్త ఆలోచనలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.

 

బిగ్ బాస్ హౌజ్ లో వీకెండ్స్ లో ఎన్టీఆర్ హౌజ్ మేట్స్ తో మాట్లాడే షోల సందర్భంగా సర్ప్రైజెస్ ను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ వీక్ వస్తున్న ఆ సర్ ప్రైజ్ ఏంటో కాదు బిగ్ బాస్ హౌజ్ లో రానా కూడా ఎంట్రీ ఇవ్వడమే. అదేంటి రానా బిగ్ బాస్ హౌజ్ లోకి ఆ 12 మంది కంటెస్టంట్స్ తో కలిసి ఉండబోతున్నాడా అంటే ప్రస్తుతం రిలీజ్ కు దగ్గరపడిన రానా నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రానా బిగ్ బాస్ తో ప్రమోట్ చేస్తున్నాడు.

 

ఎన్.టి.ఆర్ ప్రోత్సాహంతో నేనే రాజు నేనే మంత్రి ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కరోజు రానా వారితో ఉండబోతున్నాడట. రానా వెళ్లడానికి తను చేస్తున్న సినిమా ఒక కారణం కాగా.. మరో కారణం ఇలాగైనా సరే బిగ్ బాస్ కు కాస్త జనాల్లో ఆదరణ ఎక్కువవుతుందని చేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ ప్లాన్ అదిరిపోయిందని చెప్పొచ్చు.

 

రానా వచ్చాడు అంటే ఇక రాబోయే రోజుల్లో ప్రతి సినిమా ప్రమోషన్స్ లో బిగ్ బాస్ హౌజ్ పై ఓ కన్నేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే 20 రోజులు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇంకా 50 రోజులు నడవాల్సి ఉంది. మరి బిగ్ బాస్ లో రానా సందడి ఎలా ఉండబోతుందో ఈరోజు ఎపిసోడ్ లో చూసేయొచ్చు.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి