
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ముచ్చటగా మూడవ పెళ్ళికి సిద్దమైపోయాడంటూ వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. ముంబై సినిమా వర్గాల్లో ఈ వార్తే వైరల్ అవుతుంది. కమర్షియల్ సినిమాలకు దూరంగా కంటెంటున్న కథలను ఎంచుకుంటూ ప్రొఫెషన్ లో అమీర్ ఖాన్ మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ లైఫ్ లో మాత్రం ఆయన పెళ్లి మీద పెళ్లి చేసుకుంటుండటంతో విమర్శలకు దారి తీస్తోంది.
తన మొదటి భార్య రీనా దత్తాకి 15ఏళ్ళ క్రితం విడాకులిచ్చాడు. రీసెంట్ గా రెండో భార్య కిరణ్ రావు తోనూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ వార్త దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా తను మూడో పెళ్లి చేసుకుంటాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా ‘దంగల్’ చిత్రంలో తనకు కూతురిగా నటించిన నటి ఫాతిమా సనా షేక్ తోనేనని పుకార్లు వస్తున్నాయి. ఈ వార్తను ఖరారు చేస్తున్నట్లు బాలీవుడ్ విమర్శకుడు కేఆర్ కే ట్వీట్ చేసారు. తన మనమరాలు వయస్సు ఉన్న ఫాతిమాని అమీర్ పెళ్లి చేసుకోబోతున్నాడనేది ఆ ట్వీట్ సారాంశం.
అమీర్ ఖాన్‌తో యంగ్ హీరోయిన్ ఫాతిమాకు ఎఫైర్ ఉందని, అందుకే ఆయన కిరణ్ రావుతో విడిపోయారనేది చాలా మంది అంటూంటారు. అందుకే వాళ్ల ఫొటోలతో, ఫాతిమాను తెర మీదకు తెస్తున్నారు. 29 ఏళ్ల ఫాతిమా.. 56 ఏళ్ల అమీర్‌తో వరుసగా రెండు సినిమాలు చేసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని బాలీవుడ్ మీడియా లలో రూమర్స్ వినిపించాయి. ఆ వ్యవహారాన్ని అమీర్ లైట్ తీసుకోగా.. ఫాతిమా మాత్రం తనకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు తన గురించి తప్పుగా రాయడం సరికాదని సీరియస్ గా వ్యాఖ్యానించింది.
ఇక హైదరాబాద్‌లో పుట్టిన ఫాతిమా సనా షేక్.. బాలనటిగా పలు హిందీ చిత్రాల్లో నటించింది. నువ్వు నేను ఒకటవుదాం (2015)తో తెలుగులో నటించిన ఫాతిమా.. 2016లో అమీర్ ఖాన్ ‘దంగల్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో అమీర్ కూతురిగా నటించిన ఫాతిమా.. ఆ వెంటనే థగ్స్ ఆఫ్ హిందోస్థాన్‌లో జోడిగా నటించింది.ప్రమోషన్స్ ముగిశాక కూడా ఇద్దరూ చాలాకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ముంబైలో దిగినప్పుడల్లా ఆమె అమీర్ ఖాన్ ఇంటికి వెళ్లడంతో పుకార్లు మరింత బలపడ్డాయి. దీంతో రూమర్లు మొదలయ్యాయి. చివరికి అంబానీ ఇంట జరిగిన పార్టీకి, అవార్డుల వేడుకల దగ్గర కూడా వీళ్లు జోడిగా కనిపించడం మొదలెట్టారు.